Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెప్టెంబర్ నుంచి దేశవాళీ క్రికెట్ టోర్నీలు.. దులీప్ ట్రోఫీతో 2022-23 సీజన్ స్టార్ట్

The Schedule Of Indias Domestic Season 2022 - 23 Was Announced By BCCI

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) భారత దేశవాళీ సీజన్ 2022-23షెడ్యూల్‌ను ప్రకటించింది. సీజన్‌లో 1500కి పైగా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. 2023 మార్చి నెల చివరి వరకు కొనసాగుతాయి. ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీతో సీజన్ ప్రారంభమైంది. దీని తర్వాత ఇరానీ కప్ జరుగుతుంది. దులీప్ ట్రోఫీ (సెప్టెంబర్ 8-సెప్టెంబర్ 25) నాకౌట్ ప్రాతిపదికన జరుగుతుంది. ఆరు జోన్‌లు (నార్త్, సౌత్, సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ మరియు ఈశాన్య) మధ్య పోటీలు జరుగుతాయి. డే టోర్నమెంట్‌ల అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు తర్వాత జరుగుతాయి. ఇవి రెండు వైట్-బాల్ టోర్నమెంట్‌లు. ఈ టోర్నీల్లో 38జట్లు పాల్గొంటాయి. మూడు గ్రూపుల్లో 8 జట్లు ఉంటాయి. రెండు గ్రూపుల్లో 7జట్లు ఉంటాయి.

రంజీ ట్రోఫీ డిసెంబర్ 13నుంచి ప్రారంభం

ఇండియాలోని అత్యంత ఆదరణ ఉన్న దేశీయ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. ఈ ట్రోఫీలో రెండు విభాగాలుంటాయి. 1) ఎలైట్, 2) ప్లేట్. ఎలైట్ గ్రూప్, ప్లేట్ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు డిసెంబర్ 13న ప్రారంభమవుతాయి. ప్లేట్ లీగ్ జనవరి 29న ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. తర్వాత క్వార్టర్స్, సెమీఫైనల్లు, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి.

మళ్లీ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ వన్డే, టీ20 ట్రోఫీలు

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరగాల్సి ఉన్నందున.. మహిళల క్యాలెండర్ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీతో అక్టోబర్ 11న ప్రారంభమవుతుంది. నవంబర్ 5న ఈ ట్రోఫీ ముగుస్తుంది. ఆ తర్వాత సీనియర్ మహిళల ఇంటర్‌జోనల్ టీ20, టీ20 ఛాలెంజర్‌లు జరుగుతాయి. తర్వాత సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ, తర్వాత ఇంటర్ జోనల్ వన్డేలు జరుగుతాయి. ఈ సీజన్‌లో సీనియర్ మహిళల ఇంటర్‌జోనల్ టీ20, వన్డే ట్రోఫీలు తిరిగి ప్రవేశపెట్టబడడం గమనార్హం.

ఫలించిన హార్దిక్ ప్రయోగాలు, ఇండియా ఘనవిజయం *Cricket | Telugu OneIndia
తొలిసారి అండర్ 16 వన్డే టోర్నీ

తొలిసారి అండర్ 16 వన్డే టోర్నీ

తొలిసారిగా బీసీసీఐ అండర్ -16 స్థాయిలో బాలికల కోసం వన్డే టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఈ పోటీ అమ్మాయిలకు చిన్న వయస్సులోనే పోటీ క్రికెట్ అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. అండర్-19 స్థాయికి వాళ్లను మరింత రాటుదేల్చుతుంది. మహిళల అండర్ 19 టీ20 ట్రోఫీ, మహిళల అండర్ 19 టీ20 ఛాలెంజర్ అక్టోబర్ 1నుండి నవంబర్ 7వరకు షెడ్యూల్ చేయబడ్డాయి.

Story first published: Monday, August 8, 2022, 16:26 [IST]
Other articles published on Aug 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+