హిమాచల్ TO బీసీసీఐ: అనురాగ్ ఠాకూర్ ఎదుగుదల, పతనం
హైదరాబాద్: లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీంకోరు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనురాగ్ ఠాకూర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
అసలు ఎవరీ అనురాగ్ ఠాకూర్, క్రికెట్‌తో అనురాగ్ ఠాకూర్‌కు పరిచయం ఎలా ఏర్పడిందో పరిశీలిద్దాం. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ ఎంపీగా ఉన్నారు. మే 2008లో తొలిసారి లోక్‌సభకు ఎంపికయ్యారు.

2016లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక
ఆ తర్వాత 2014లో తిరిగి మళ్లీ లోక్ సభకు ఎంపికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో మే 2016లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీసీసీఐ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఠాకూర్ వయసు 41 ఏళ్లు. 2017, జనవరి 2న అనురాగ్ ఠాకూర్‌ను తొలిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2000వ సంవత్సరంలో ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్
అనురాగ్ ఠాకూర్ 2000వ సంవత్సరంలో ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఠాకూర్ పరుగులేమీ చేయలేదు. ఏడు ఓవర్లు వేసిన అతను రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత అదే ఏడాది అనురాగ్ ఠాకూర్ హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

జూనియర్ నేషనల్ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు
జాతీయ జూనియర్ సెలక్టర్ పదవికి అర్హత సాధించాలంటే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయిన ఆడాలి. అనురాగ్ ఒక మ్యాచ్ అనుభవం ఉంది కాబట్టి, అతను 2000 సంవత్సరంలోనే జూనియర్ నేషనల్ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత 2011లో అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ ఆఫీస్ బేరర్ అయ్యాడు.

శ్రీనివాసన్ హయాంలో సంయుక్త కార్యదర్శి
బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ హయాంలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 2013లో ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌పై అనురాగ్ వ్యతిరేకంగా మాట్లాడాడు. అవినీతి ఆటగాళ్లు, అధికారులకు ఉద్వాసన పలుకాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో 2015లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి శ్రీనివాసన్‌ను సుప్రీం కోర్టు తొలిగించింది.

జనవరి 2న అనురాగ్ ఠాకూర్‌కు ఉద్వాసన
దాంతో బీసీసీఐ అధ్యక్షుడిగా జగన్మోహన్ దాల్మియా నియమితుడయ్యాడు. ఆ సమయంలో ఠాకూర్ బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత దాల్మియా మరణంతో 2016, మే22న అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టారు. లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌కు ఉద్వాసన పలికారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications