For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులోకి గంభీర్ రీఎంట్రీ: కారణాలు ఇవే

By Pratap

ముంబై: గౌతం గంభీర్ జాతీయ క్రికెట్ జట్టులోకి రావడం గగనమే అనే పరిస్థితులు ఉంటూ వచ్చాయి. కానీ, అనూహ్యంగా అతను మళ్లీ ఎంపికయ్యాడు. అతని రీఎంట్రీకి బలమైన కారణాలే ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత జట్టు ప్రపంచ కప్ సాధించిన రెండు సార్లు గౌతమ్ గంభీర్ కీలకమైన పాత్ర పోషించాడు. 2007 సెప్టెంబర్ 24న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లకు 157 పరుగులు చేసింది. అప్పుడు గంభీర్ అందరి కన్నా ఎక్కువగా 75 పరుగులు చేశాడు. మ్యాచులో అతని తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోర్ రోహిత్ శర్మ చేసిన 30 పరుగులే.

The reasons for reentry of Gambhir into team India

ఆ తర్వాత 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణయించిన 275 పరుగులను ఛేదించే క్రమంలో తన బ్యాటింగ్‌తో గంభీర్ కీలకమైన పాత్ర పోషించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 0, టెండూల్కర్ 18, కోహ్లీ 35 పరుగులకే వెనుదిరిగిన స్థితిలో గంభీర్ నిలకడగా ఆడి 97 పరుగులతో గట్టి పునాది వేసి ఫైనల్ మ్యాచ్ విజయానికి బాటలు వేశాడు.

ఆ సమయంలో గంభీర్ లేని జట్టును ఊహించలేమనే స్థితి వచ్చింది. ఆ స్థితిలో 2012లో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌ తర్వాత రెండేళ్లపాటు జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా న్యూజిలాండ్‌తో స్వదేశీ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌కు అతనికి పిలుపు వచ్చిది.

గంభీర్‌కు కెప్టెన్లు కోహ్లీ, ధోనీలతో విభేదాలున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే చొరవతో జట్టులోకి వచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లాండుతో నవంబర్ 9 నుంచి జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో పాటుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ గాయాల పాలు కావడం కూడా అతనికి కలిసి వచ్చింది. జట్టులో సీనియర్‌గా, నమ్మకమైనవాడిగా అతనికి చోటు దక్కిందని భావించవచ్చు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+