ఐపీఎల్ 10 ఫైనల్‌కు ముందే ముంబైకి జాంటీ రోడ్స్ శుభవార్త
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఆదివారం సాయంత్రం 6:20కి రోడ్స్ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనించింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై, పుణే జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందే జాంటీ రోడ్స్ ఈ శుభవార్తను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ముంబై ఇచ్చే బహుమతికి ముందే బహుమతి? అంటూ తన భార్య కుమారుడికి పాలు ఇస్తోన్న ఫొటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. నాథన్ జాన్ ఈ లోకంలోకి వచ్చాడంటూ జాంటీ రోడ్స్ ఆనందం వ్యక్తం చేశాడు.
రెండు సంవత్సరాల క్రితం జాంటీ రోడ్స్ భార్య ఓ పాపకి జన్మనివ్వగా.. తనకు 'ఇండియా' అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. భారత సంస్కృతి, సంప్రదాయాలను అమితంగా ఇష్టపడే జాంటీ రోడ్స్ దంపతులు తమ కూతురికి మన దేశం పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాకు చెందిన జాంటీ రోడ్స్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications