క్రిస్ గేల్ అంటేనే ఓ అద్భుతం: బహుశా ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు!

హైదరాబాద్: వయసు 40 ఏళ్లు. వెస్టిండిస్ తరుపున ఐదో వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో అతనో అద్భుత ఆటగాడు. ఎవరి గురించి చెప్తునున్నానో ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది. అతనెవరో కాదు వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
క్రిస్ గేల్ అంటేనే ఓ అద్భుతం. బంతిని అలవోకగా స్టేడియాన్ని దాటించగలడు. స్పిన్నర్లకు సింహస్వప్నం. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఉతికి ఆరేసిన సందర్భాలు ఎన్నో. గేల్ ఫామ్‌లో ఉంటే ఏ బౌండరీ అయిన అతడి బ్యాట్ కింద చిన్నది కావాల్సిందే. స్టేడియంలో పరుగుల వర్షం కురువాల్సిందే. ప్రేక్షకులు సైతం ఫీల్డర్లుగా మారతారు.

పంజాబ్ విజయాల్లో కీలకపాత్ర
ఐపీఎల్ లాంటి టోర్నీలో గేల్ బాదిన సిక్సులకు ప్రేక్షకులు అనేక సార్లు గాయాలు పాలయ్యారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో క్రిస్ గేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్‌కు అద్భుతమైన విజయాలను అందించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన క్రిస్ గేల్ 162.02 స్ట్రయిక్ రేట్‌తో 444 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు
ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో గేల్ అత్యధిక స్కోరు 99 నాటౌట్. క్రీజులో కుదురుకోవడం కోసం మొదటి పది బంతులను ఢిపెన్స్ ఆడతాడు. కుదురుకున్న తర్వాత బౌలర్ల భరతం పడతాడు. పరుగుల వర్షం కురిపిస్తాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ను మూడు విభాగాలు విభజించారు. మొదటిది క్లాసికల్ టైప్. స్ట్రోక్ ప్లేతో పరుగులు రాబడతారు. ఇందుకు ఉదాహరణ సచిన్ టెండూల్కర్(స్టైట్ డ్రైవ్), రాహుల్ ద్రవిడ్(స్వ్కేర్ కట్), విరాట్ కోహ్లీ (కవర్ డ్రైవ్). ఇలాంటి షాట్స్ కోచింగ్ మాన్యువల్‌లో ఉంటాయి.

మిడ్ వికెట్ మీదుగా బౌండరీ
ఇక, రెండో రకం ఆర్ధోడాక్స్ టైప్. మహేంద్ర సింగ్ ధోని, ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాళ్లు. వీళ్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడతారు. ఉదాహరణకు ఆఫ్‌స్టంప్ వైపు ఫీల్డర్లను పెట్టి బౌలర్ ఆఫ్ స్టంప్‌పైకి బంతిని సంధిస్తే... క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ స్టంప్స్‌ను కవర్ చేస్తూ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించడం లాంటివి.

మూడో రకం ఆటగాడు క్రిస్ గేల్
మూడో రకం... ఈ రకం ఆటగాళ్లు చేతికి కంటికి చక్కటి సమన్వయాన్ని కలిగి ఉంటారు. పవర్ హిట్టింగ్ చేస్తారు. మానసికంగా, శారీరకంగా బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించాలి చూస్తారు. ఇలాంటి ఆటగాళ్లకు బౌండరీతో సంబంధం ఉండదు. ఈ కోవకు చెందిన ఆటగాడు క్రిస్ గేల్. బౌలర్ ఎవరైనా సరే బంతి స్టాండ్స్‌లో ఉంటుంది.

అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అంటూ
అందుకే కాబోలు క్రిస్ గేల్‌ను అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుచుకుంటారు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన క్రిస్ గేల్ ఈ ఫార్మాట్‌లో పదివేలకుపైగా పరుగులు చేశాడు. తాజాగా, గురువారం వెస్టిండిస్ బోర్డు ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో సెలక్టర్లు క్రిస్‌గేల్‌కు చోటు కల్పించారు. గేల్‌కు బహుశా ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications