Anjali Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ వయస్సు 57 ఏళ్లు. అయినా ఆమె అందం, ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల సాధారణమైన సల్వార్ సూట్‌లో ఆమె కనిపించిన తీరు, నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. సింపుల్ లుక్‌లోనూ ఆమె ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అసలైన గొప్పతనం అంటే ఇదే..
సాధారణంగా డబ్బు, కీర్తి ఎక్కువగా ఉన్నవారిలో కొందరికి అహంకారం ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. కానీ నిజమైన గొప్పతనం అనేది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా వినయంగా.. ఇతరుల పట్ల ప్రేమతో వ్యవహరించినప్పుడే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ సతీమణిగా ఉండి కూడా.. పాపరాజీ 'గుడ్ మార్నింగ్' అని పలకరించినప్పుడు చిరునవ్వుతో అదే విధంగా బదులివ్వడం కేవలం మర్యాద మాత్రమే కాదు, ఆమె వినయానికి, సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ భార్యగానే కాకుండా, అంజలి టెండూల్కర్ స్వయంగా ఓ సక్సెస్‌ఫుల్ డాక్టర్ కూడా. వినయంతో పాటు, ఆమె సింపుల్‌గా ఉండటంలోనే అసలైన అందం ఉంటుందని నిరూపించారు.

కొత్త ఇంటి వద్ద సచిన్, అంజలి
తాజాగా అంజలి టెండూల్కర్ ముంబైలో నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటి వద్ద కనిపించారు. కారు దిగగానే పాపరాజీ ఆమె ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో, పాపరాజీ ఆమెను 'గుడ్ మార్నింగ్' అని పలకరించగా.. అంజలి చాలా సౌమ్యంగా, స్నేహపూర్వకమైన చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సచిన్ టెండూల్కర్ కూడా అక్కడికి వచ్చారు. పాపరాజీ అక్కడే ఉన్నా, ఇద్దరూ తమ పనులు చూసుకున్నారు. సచిన్ తన కొత్త ఇంటి పనులను చూసిన తర్వాత ముందుగా బయటకు వచ్చి అంజలి కోసం వేచి ఉన్నారు. అంజలి బయటకు రాగానే ఇద్దరూ కలిసి తమ పోర్షే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సచిన్, అంజలి కుటుంబ వివరాలిలా..
సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ పెళ్లి 1995 మే 25న జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్. ఇటీవల అర్జున్‌కు తన స్నేహితురాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. మరోవైపు సారా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. సచిన్, అంజలిల సాదాసీదా జీవితం, వారి సంస్కారం ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది.