Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నయా ఫ్యాబ్-4: దిగ్గజాల వారసులు వచ్చేశారు!

దిగ్గజాల పరంగా క్రికెట్ ప్రపంచం సంధి దశలో ఉంది. క్రికెట్‌ క్షేత్రంలో యోధులుగా దశాబ్దానికిపైగా సత్తాచాటిన విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల నిష్క్రమణకు వేళైంది. మరికొన్నాళ్ల పాటే ఈ ఫ్యాబ్-4 విన్యాసాలు కనిపించనున్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మిగిలిన ఈ వీరులు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా కనిపించట్లేదు.

టెస్టుల్లో మాత్రం మరో రెండేళ్ల పాటు సునాయాసంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ నలుగురిలో జో రూట్ మినహా రెడ్ బాల్ క్రికెట్‌లో మిగిలెనవరూ జోరుగా ప్రభావం చూపలేకపోతున్నారు. క్రికెట్ కదన రంగంలో వాళ్ల బ్యాట్ల పదును తగ్గింది. దాంతో క్రికెట్‌ను ఆరాధించే ప్రజలు కొత్త యోధుల రాకకు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ దిగ్గజాల సంధి దశలో వారసులుగా నయా ఫ్యాబ్-4 అంటూ కుర్రాళ్లు ముందుకు వచ్చారు. కోహ్లి, కేన్, స్మిత్, రూట్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా అదరగొడుతున్నారు. ఫ్యూచర్ ఫ్యాబ్‌గా కీర్తి పొందుతున్నారు. వాళ్లెవరంటే..

The Next Fab-4 of International Cricket Who Will Follow in the Footsteps of Kohli Williamson Root and Smith

యశస్వీ జైస్వాల్
నయా ఫ్యాబ్‌-4లో భారత్ స్థానాన్ని సగర్వంగా నిలబెట్టేలా యశస్వీ జైస్వాల్ ముందుకొచ్చాడు. విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల అడుగుజాడల్లో నడుస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం కుర్రాడు ఆడింది కేవలం 11 టెస్టులు మాత్రమే. ఇప్పటికే 1217 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాదాడు. పరిస్థితిని బట్టి ఫీల్డర్ల మధ్య నుంచి స్టైలిష్‌‌గా బౌండరీలు సాధించలగలడు. అలాగే ప్రేక్షకులను ఫీల్డర్లుగా మారుస్తూ సిక్సర్ల వర్షం కురిపించగలడు జైస్వాల్.

కామిందు మెండిస్
స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్, రాజకీయ జోక్యం సహా కొన్ని కారణాలతో గాడితప్పిన శ్రీలంక క్రికెట్‌ను ఆదుకోవడానికి కామిందు మెండిస్ వచ్చాడు. అరంగేట్రంతోనే సంచలనాలు మొదలుపెట్టాడు. 26 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆడింది 9 టెస్టుల్లో. 1055 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో కనీసం 50+ స్కోరు సాధిస్తున్నాడు. అంతేగాక కామిందు మెండిస్ కుడిచేతితో ఆఫ్ బ్రేక్ స్పిన్ కూడా వేయగలడు. కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు.

రచిన్ రవీంద్ర
కేన్ విలియమ్సన్‌కు వారసుడిగా న్యూజిలాండ్‌ నుంచి నయా ఫ్యాబ్-4లోకి రచిన్ రవీంద్ర వచ్చాడు. 24 ఏళ్ల ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. ఓపికగా జట్టు పరిస్థితిని బట్టి గేర్‌లు మారుస్తున్నాడు. సహచరుల వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకుపోతున్నాడు. ఆడిన 10 టెస్టుల్లోనే 672 పరుగులు చేశాడు. సెంచరీతో పాటు డబుల్ సెంచరీ బాదాడు. నయా ఫ్యాబ్-4లో మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే కాస్త తక్కువ పోటీని ఇస్తున్నా భవిష్యత్‌లో దీటుగా పరుగులు సాధించగలడు.

హ్యారీ బ్రూక్
జో రూట్‌కు వారసుడిగా ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ వచ్చాడు. ఈ 25 ఏళ్ల బ్యాటర్ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడు. అలాగే బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడగలడు. 18 టెస్టుల్లో ఏకంగా 62+ సగటుతో 1875 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌పై తాజాగా ట్రిపుల్ సెంచరీతో పాటు ఓవరాల్‌గా 5 టెస్టుల సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. నిలకడగా పరుగులు చేస్తూ సంచలనాలు నమోదు చేస్తున్నాడు.

Story first published: Sunday, October 13, 2024, 11:13 [IST]
Other articles published on Oct 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+