జింబాబ్వే మీద కూడా అరంగేట్రం చేయనివ్వరా..?
త్రిపాఠికి, రుతురాజ్‌కు ఒక్క మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వకపోతే సిరీస్‌ల మీద సిరీస్‌లకు ఎందుకు ఎంపిక చేసినట్లు.. ఎంచక్కా ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ అయినా వాళ్లు ఆడేవారు కదా అంటూ నెటిజన్లు టీం మేనేజ్ మెంట్‌పై గుస్సా అవుతున్నారు. ఆవేశం స్టార్ అవేశ్ ఖాన్‌కు, అసలే ఫాంలో లేని ఇషాన్ కిషన్‌కు అవకాశాలొస్తున్నాయి గానీ.. నిఖార్సైన ప్లేయర్లుగా పేరున్న రుతురాజ్, రాహుల్ త్రిపాఠికి మాత్రం మోక్షం దక్కట్లేదు. జింబాబ్వే లాంటి జట్టుపై కూడా వీళ్లని అరంగేట్రం చేయించకుంటే ఇక వీళ్లకు ఇంకెక్కడ అవకాశాలొచ్చేది.. వీళ్లు ఇంకెపుడు నిలదొక్కుకునేది అంటూ సూటి ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇక వీరికి అవకాశం కల్పించాల్సిందంటూ నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే జట్టు సెలెక్షన్ విషయం పట్ల బూతులు కూడా తిడుతున్నారు.
కేఎల్ రాహుల్ భయపడుతున్నాడు
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ మీద కూడా కొందరు నిప్పులు చెరుగుతున్నారు. రాహుల్ చాలా ఇన్ సెక్యూర్ ఫెల్లో అని.. ప్రయోగం చేస్తే ఎక్కడ బెడిసికొడుతుందేమోనని భయపడుతున్నాడని.. అతనికి కెప్టెన్సీ నైపుణ్యాలు లేవంటూ కొందరు పేర్కొంటున్నారు. మరికొందరేమో రాహుల్‌ను వెనకేసుకొస్తున్నారు. అసలు రాహుల్ చేసిన తప్పేంటి..? ధావన్ కేవలం వన్డే ఆడతాడు అతన్ని తీసేస్తే ఎలా.. గిల్ మంచిగా నిలదొక్కుకుంటున్న టైంలో అతన్ని తప్పిస్తే ఎలా.. దీపక్ హుడా, సంజూ శాంసన్ చెప్పుకోదగ్గ మ్యాచ్‌లు ఏమైనా ఆడారా, ఇషాన్ కిషన్‌ను ఒకట్రెండు మ్యాచ్‌లను బట్టి అంచనా వేయాలా..? వాళ్లకంటూ సరైన అవకాశం దొరకాలని అందుకే రాహుల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని మెచ్చుకుంటున్నారు.
వాటర్ బాయ్స్‌గా సెలెక్ట్ చేయాల్సింది
అయితే రాహుల్ కెప్టెన్సీలో కొంత బెటరే అయినప్పటికీ.. అతను సిరీస్ గెలిచాక ఏమాత్రం డేరింగ్ డిసిషన్లు తీసుకోకపోవడాన్ని మాత్రం నెటిజన్లు ఏకిపారేశారు. ఇక టీం మేనేజ్‌మెంట్ రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్ల కెరీర్లను స్పాయిల్ చేస్తుందని మండిపడుతున్నారు. ఇంకొందరైతే... వాళ్లిద్దరిని స్టేడియం అవతలకు పంపించి.. అక్కడ టూరిస్ట్ ప్రదేశాలను చూసి రమ్మనండి.. జింబాబ్వేకు పోయినదానికి కాస్త ఆ అనుభూతి అన్న ఉంటుందంటూ దెప్పిపొడుస్తున్నారు. త్రిపాఠిని, రుతురాజ్‌ను పొరపాటున జట్టులో ప్లేయర్‌గా సెలెక్ట్ చేశారు.. వాళ్లను వాటర్ బాయ్స్‌గా సెలెక్ట్ చేయాల్సింది.. సరిగ్గా సెట్టయ్యేది అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ అయితే సిరీస్ గెలిచాక కూడా సిల్లీ సెలెక్షన్ ఏంటో అంటూ ఎంపికను తప్పుబట్టాడు. మరో నెటిజన్ నా లడ్డూలో టీం.. అంటూ పరోక్షంగా బూతులు తిట్టాడు.
మూడో వన్డేకు ఎంపికైన భారత తుది జట్టు
ఓపెనర్లు : శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్),
మిడిలార్డర్ : శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా,
లోయర్ ఆర్డర్ : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్,
టెయిలెండర్స్ : శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
బెంచ్ ప్లేయర్లు : రాహుల్ త్రిపాఠి, షాబాజ్ అహ్మద్, ప్రసీద్ క్రిష్ణ, రుతురాజ్ గైక్వాడ్, సిరాజ్


Click it and Unblock the Notifications












