
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా అడిలైడ్ లో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. జింబాబ్వే ఆటగాళ్లలో సికిందర్ రజా టాప్ స్కోర్ గా ఉన్నాడు. రజా 24 బంతుల్లో మూడు సిక్స్ లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలయమ్సన్ 23 బంతుల్లో 3 ఫో+ర్లతో 28 పరుగులు చేశాడు. మాధేవెరే 1, కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ 3, వికెట్ కీపర్ చకబ్వా 5, మిల్టన్ షుంబా 2, ర్యాన్ బర్ల్ 2, ఎల్ జోంగ్వే 6, నగరవ 9, చతారా 6, ముజరబానీ 1 పరుగు చేశారు.
మ్యాక్స్ డౌడ్
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ 3 వికెట్లు తీయగా.. బ్రాండన్ గ్లోవర్, బాస్ డి లీడే రెండేసీ 2 వికెట్లు పడగొట్టారు. 118 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాక్స్ డౌడ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 47 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. టామ్ కూపర్ 29 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, ముజారబానీ దీవెన మూడేసి వికెట్లు తీశారు.
సెమీస్
ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నెదర్లాండ్స్ సెమీస్ కు వెళ్లుదు. గ్రూప్-2లో నెదర్లాండ్స్ 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. జింబాబ్వే కూడా సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే. సౌతాఫ్రికా సెమీస్ కు వెళ్లడం దాదాపు ఖారారు అయింది. మిగతా రెండు మ్యాచ్ ల్లో సౌతాఫ్రికా ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ కు వెళ్లడం పక్కా. ఇక భారత్ విషయానికొస్తే మిగతా రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇండియా రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే 8 పాయింట్లతో సెమీస్ కు వెళ్తుంది. ఒక వేళ ఒక మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే.. సెమీస్ అవకాశాలు పాక్, బంగ్లాదేశ్ గెలుపుపై ఆధారపడి ఉంటాయి.