204 అవుట్: కోహ్లీ డీఆర్ఎస్ అడగకపోవడానికి కారణం?
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 240 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో కోహ్లీ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా వరుసగా నాలుగు సిరిస్‌లలో డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్ మెన్‌గా కోహ్లీ రికార్డు చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు వెస్టిండిస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లాండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు. డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.

204 పరుగుల వద్ద కోహ్లీ అవుట్
కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన వెంటనే తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో కోహ్లీ 204 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ కోహ్లీ అవుటైనప్పుడు ‘రివ్యూ' అడిగి ఉంటే ఏమయ్యేది? అతను క్రీజులో కొనసాగి ఉంటే ఏం జరిగేది? ఏముంది ట్రిపుల్ సెంచరీ సాధించేవాడేమో.

ప్యాడ్‌కు తగిలిన బంతి
తైజుల్ ఇస్లామ్ వేసిన బంతిని స్లైడర్‌ను కట్ చేద్దామన్న ప్రయత్నం విఫలమై.. బంతి మొదట ప్యాడ్‌కు తగిలింది. వెంటనే బంగ్లా ఫీల్డర్లు అంఫైర్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ మారస్ ఎరాసమస్ వెంటనే చేయి పైకెత్తి ఔటని ప్రకటించాడు.

వృద్ధిమాన్ సాహా ఏదో మాట చెప్పబోయాడు
నిజానికి కోహ్లీ తాను అవుట్ కాలేదన్న విషయం తెలుస్తూనే ఉంది. అయితే రెండో ఆలోచన చేయకుండా నాన్ స్ట్రయికర్స్ ఎండ్ మీదుగా పెవిలియన్‌వైపు నడిచాడు. మధ్యలో వృద్ధిమాన్ సాహా ఏదో మాట చెప్పినప్పటికీ .. కోహ్లీ వెళ్లిపోవడానికే సిద్ధమయ్యాడు. బహుశా డీఆర్‌ఎస్ అడగమని సాహా చెప్పి ఉండవచ్చు.

కోహ్లీ డబుల్‌పై మార్మోగిన స్టేడియం
కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌కు (204 పరుగులు, 246 బంతులు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో స్టేడియం మార్మోగింది. రీ ప్లేలో మాత్రం ఆ బంతి ఆఫ్ స్టిక్ పక్కగా వెళుతున్నట్లు కనిపించింది. అంపైర్ నిర్ణయంపై ‘రివ్యూ' అడిగి ఉంటే.. కోహ్లీ క్రీజులో కొనసాగేవాడేమో. అదే గనుక జరిగి ఉంటే కోహ్లీ ట్రిపుల్ సెంచరీ సాధించేవాడే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications