T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌ను వదలని వాన.. వర్షంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు..

టీ20 వరల్డ్ కప్ లో మరో మ్యాచ్ వర్షార్పణం అయింది. శుక్రవారం రెండు మ్యాచ్ లు వర్షంతో రద్దు అయ్యాయి. సూపర్-12 లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. అంతకుముందు ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన సూపర్-12 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మెల్ బోర్న్ లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ఈ రెండు మ్యాచ్ లు రద్దు చేశారు.

ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్
గ్రూప్-1కు సంబంధించి ఇప్పటి వరకు వర్షం కారణంగా మూడు మ్యాచ్ లు రద్దు అయ్యాయి. 26న న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ వర్షంతో రద్దు అయింది. శుక్రవారం ఆఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్ మ్యాచ్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా కనీసం టాస్ కూడా వేయకుండా రద్దు అయ్యాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్ 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలువగా.. ఆప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో గెలవగా.. మరో మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డు పడింది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఐర్లాండ్ 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా కూడా మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

భారత్
ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గెలుపొందింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ఒక్కో మ్యాచ్ లో గెలిచి చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక గ్రూప్-2లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా సెంకడ్ ప్లెస్ లో ఉంది. రన్ రేట్ పరంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications