For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ లీగ్ టి20కి ముస్తాబైన బెంగళూరు

By Nageswara Rao
Eden Garden
బెంగళూరు: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చాంపియన్స్‌లీగ్‌ ట్వంటీ20 క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ముగియడంతో శుక్రవారం నుండి బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌, దక్షిణాఫ్రికాకు చెందిన వారియర్స్‌ తలపడనున్నాయి. ఈసారి ఛాంపియన్స్ లీగ్‌లో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు తమ కళ్లు చెదిరే ఆటతో అభిమానులను అలరించనున్నారు. ఇండియా నుండి డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు బరిలోకి దిగుతున్నాయి.

గౌతమ్ గంభీర్‌, సచిన్ టెండూల్కర్‌, జహీర్‌, మునాఫ్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయాల వల్ల టోర్నీకి దూరమయ్యారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్న ఇతర ఆటగాళ్లు తమ అద్భుత ఆటతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో చెన్నై, న్యూసౌత్‌ వెల్స్‌, ముంబై ఇండియన్స్‌, కేప్‌ కోబ్రాస్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, బెంగళూరు, సోమర్‌సెట్‌, వారియర్స్‌, సౌతాస్ట్రేలియా జట్లు ఉన్నాయి. 9 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించగా, కోల్‌కతా, ట్రినిడాడ్‌, సోమర్‌సెట్‌ జట్లు క్వాలిఫయింగ్‌ మ్యాచుల్లో గెలిచి మెయిన్‌డ్రాలో చోటు పొందాయి.

ఇది ఇలాఉంటే ఛాంపియన్స్ లీగ్ టి20ని పురస్కరించుకొని బెంగుళూరులో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. ఛాంపియన్స్ లీగ్ టి20 తొలి రోజు ఒక మ్యాచ్‌ను మాత్రమే నిర్వహిస్తున్నారు. తర్వాత రోజు నుంచి రెండేసి మ్యాచ్‌ల చొప్పున నిర్వహించనున్నారు. బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో చాంపియన్స్‌లీగ్‌ మ్యాచులు జరుగనున్నాయి. కోల్‌కతాలో జరగాల్సిన మూడు మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్‌ 25న రెండు, 27న ఒక మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది. కాగా, అక్టోబర్‌ 9న చెన్నైలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

శుక్రవారం చిన్నసామి స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్‌కు బెంగళూరు, వారియర్స్‌ జట్లు సిద్ధమయ్యాయి. వెటోరీ సారథ్యంలోని బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బర్త్‌డే బాయ్‌ క్రిస్‌ గేల్‌ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. ఐపిఎల్‌లో బెంగళూరుకు సంచలన విజయాలు అందించిన గేల్‌ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. కోహ్లి, డివిలియర్స్‌, దిల్షాన్‌, నన్నెస్‌, అరుణ్‌ కార్తీక్‌, అరవింద్‌ తదితరులతో బెంగళూరు పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు జొహాన్‌ బోథా నేతృత్వంలోని వారియర్స్‌ జట్టులోనూ స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. మార్క్‌ బౌచర్‌, అశ్వెల్‌ ప్రిన్స్‌, ఎన్తిని, నికిబోయే, పర్నేల్‌ తదితరులతో వారియర్స్‌ బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్‌ లీగ్‌ టోర్నీలో పాల్గొనే ముంబై ఇండియన్స్‌ జట్టులో సచిన్‌ స్థానంలో ఆండ్రూ సైమండ్స్‌ పాల్గొంటాడని ముంబై జట్టు టెక్నికల్‌ కమిటీ తెలియజేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+