న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింగ్ ఈజ్ బ్యాక్: విశాఖ పిచ్‌ని పరిశీలించిన ధోని (ఫోటోలు)

India vs West Indies 2 Odi : Dhoni Does Customary Pitch Inspection Ahead Visakhapatnam ODI| Oneindia
 The King is Here - Dhoni Relives Fond Memories at Happy Hunting Ground Vizag

విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో వన్డేకి సర్వం సిద్ధమైంది. ఈ వన్డే కోసం ఇప్పటికే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

<strong>ఐకానిక్ ఫోటోషూట్: డిజైనర్ దుస్తుల్లో మెరిసిన టెన్నిస్ క్వీన్స్ (ఫోటోలు)</strong>ఐకానిక్ ఫోటోషూట్: డిజైనర్ దుస్తుల్లో మెరిసిన టెన్నిస్ క్వీన్స్ (ఫోటోలు)

కాగా, టీమిండియా ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత అంబటి రాయుడితో కలిసి నేరుగా పిచ్‌ దగ్గరకు వెళ్లిన మహేంద్రసింగ్ ధోని స్వయంగా పిచ్‌ను తడిమి పరిశీలించాడు. సాధారణంగా జట్టు కెప్టెన్, కోచ్‌కి మాత్రమే పిచ్‌ని పరిశీలించేందుకు స్టేడియం క్యూరేటర్లు అనుమతిస్తారు.

 ధోనిపై ఉన్న గౌరవంతో

ధోనిపై ఉన్న గౌరవంతో

అయితే, ధోని మాజీ కెప్టెన్ కావడం... అతడిపై ఉన్న గౌరవంతో వైజాగ్ క్యూరేటర్ ధోనిని పిచ్ వద్దకు అనుమతించినట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో భారత వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నా ఇప్పటికీ మైదానంలో అనధికార కెప్టెన్‌గా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పు చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఆసియా కప్‌లో అనధికారిక కెప్టెన్‌గా ధోని

ఆసియా కప్‌లో అనధికారిక కెప్టెన్‌గా ధోని

విండిస్‌తో సిరిస్‌కు ముందు జరిగిన ఆసియా కప్‌లో ధోని ఈ విధంగా భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, గువహటి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డే మ్యాచ్‌లో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి (140) , రోహిత్ శర్మ (152 నాటౌట్) సెంచరీతలో రాణించడంతో టీమిండియా 42.1 ఓవర్లలోనే ఛేదించిన సంగతి తెలిసిందే.

 1-0 ఆధిక్యంలో టీమిండియా

1-0 ఆధిక్యంలో టీమిండియా

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడంతో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. విశాఖపట్నం వేదికగా బుధవారం పర్యాటక వెస్టిండిస్ జట్టుతో తలపడే భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. తొలి వన్డే జట్టునే ప్రకటించిన జట్టు మేనేజ్‌మెంట్ రెండో వన్డే కోసం కొత్తగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరుని చేర్చింది.

రెండో వన్డేకు భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ

అయితే తుది జట్టులో కుల్దీప్‌ ఆడుతాడా లేక రిజర్వ్ బెంచికే పరిమితం అవుతాడా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అలా కాకుండా కెప్టెన్‌ కోహ్లీ ముగ్గురు స్పిన్నర్లకు మొగ్గు చూపితే ఉమేశ్‌ లేదా ఖలీల్ బెంచ్‌కు పరిమితం అవుతారు.

టీమిండియా:

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

Story first published: Tuesday, October 23, 2018, 18:00 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X