Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరీ మిస్టరీ గర్ల్?: ఐపీఎల్ పుణ్యమా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్!

IPL 2019 : Royal Challengers Bangalore Fangirl,Internet Is Crushing Hard On Her ! || Oneindia
The Internet Is Crushing Hard On This RCB Fangirl Who Gained Over 150k Followers Overnight

హైదరాబాద్: ఐపీఎల్ పుణ్యమా అని మామూలు క్రికెటర్లు సైతం ఒక్కరాత్రికే స్టార్ క్రికెటర్లు అవుతున్నారు. అయితే, తాజాగా ఓ అభిమాని కూడా రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయింది. టోర్నీలో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ధేశించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇదే ఆఖరి మ్యాచ్. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆర్సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడంతో అభిమానులు సైతం తెగ ఆనందపడ్డారు. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ యువతి మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

మళయాళ నటి ప్రియా వారియర్ లాగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్షెషన్ అయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కెమెరాలు ఈ అమ్మడిని స్క్రీన్‌పై చూపించడంతో ఆమె చేష్టలకు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది.

దీంతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంటర్నెట్‌లో ఎవరీ మిస్టరీ గర్ల్? అంటూ నెటిజన్స్ శోధించడం చేయడం మొదలు పెట్టారు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా ఆమె పేరు దీపిక ఘోష్‌గా గుర్తించారు. దాంతో యువతి అందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, May 6, 2019, 15:10 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+