For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ టోర్నీలో భారత్-పాక్‌ల మధ్య పోరు సాగిందిలా..

The India Vs Pakistan Battle Is All Set To Resume In The Asia Cup 2018

హైదరాబాద్: క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడుతున్నాయంటే ఓ యుద్ధం జరుగుతున్నంత ప్రచారం లభిస్తుంది. అభిమానుల భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. దాయాదిపై తిరుగులేని విజయం సాధించి స్వదేశంలో తలెత్తుకు తిరగాలని ఆటగాళ్లు భావిస్తారు. ఇక మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనం వరుస కడతారు. టికెట్ల కోసం తిప్పలు పడతారు.

ఆసియాకప్‌-2018లోనూ భారత్‌, పాకిస్థాన్‌ పోరు ఆసక్తికరం కానుంది. సెప్టెంబర్‌ 19న దాయాదుల పోరుకు దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానం వేదిక కానుంది. ఇంతకీ సంగతేమిటంటే భారత్‌, పాక్‌ ఇప్పటి వరకు ఆసియా కప్‌ ఫైనల్లో తలపడలేదు. ఎప్పుడూ లీగ్‌ దశకే పరిమితం అవుతున్నాయి.

తొలినాళ్లలో భారత్ విజయకేతనం:

తొలినాళ్లలో భారత్ విజయకేతనం:

1984లో భారత్‌ తొలుత 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రోజర్‌ బిన్నీ, రవిశాస్త్రి చెరో 3 వికెట్లతో విజృంభించడంతో పాక్‌ 134 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా 54 పరుగుల తేడాతో గెలిచింది. 1988లో అర్షబ్‌ ఆయుబ్‌ 5 వికెట్లతో చెలరేగడంతో పాక్‌ 142 పరుగులకే కుప్పకూలింది. మొహిందర్‌ అమర్‌నాథ్‌ 74 పరుగులు చేసి భారత్‌ను విజయ పథంలో నిలిపాడు.

పరాజయం పాలైన టీమిండియా

పరాజయం పాలైన టీమిండియా

1995లో భారత్‌కు పరాభవం తప్పలేదు. ఇంజమాముల్‌ హఖ్‌ (88) వీరోచిత బ్యాటింగ్‌తో పాక్‌ 266 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఆ తర్వాత అకిబ్‌ జావెద్‌ 5 వికెట్లతో విజృంభించడంతో భారత్‌ 169 పరుగులకు పరిమితమైంది. 2000లోనూ భారత్‌కు పరాభవం తప్పలేదు. మహ్మద్‌ యూసఫ్‌ సెంచరీతో పాక్‌ 295 పరుగులు చేసింది. అజయ్‌ జడేజా 93 పరుగులు చేసినా అదృష్టం కలిసిరాలేదు. మరో బ్యాట్స్‌మన్‌ నిలవకపోవడంతో 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొహమ్మద్ అజహరుద్దీన్‌, అజయ్‌ జడేజాకు ఇదే చివరి మ్యాచ్‌.

2014లో భారత్‌‌పై పాక్‌ వికెట్‌ తేడాతో :

2014లో భారత్‌‌పై పాక్‌ వికెట్‌ తేడాతో :

1997లో భారత్‌..పాక్‌ పోరు వీక్షించే అవకాశం అభిమానులకు దక్కలేదు. వర్షం, వెలుతురు లేమితో మ్యాచ్‌ రద్దైంది. రిజర్వు డే రోజూ అంతే సంగతులు. 2004లోనూ పాక్‌దే విజయం. షోయబ్‌ మాలిక్‌ (143) సెంచరీతో పాక్‌ తొలుత 300 పరుగులు చేసింది. ఛేదనలో సచిన్‌ (78), గంగూలీ (39) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ పేవలంగా ఆడటంతో భారత్‌ 241/8కి పరిమితమైంది. 2014లో భారత్‌ మొదట 245 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ చివరి ఓవర్‌లో వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

రైనా (84), యువరాజ్‌ (48) రాణించడంతో

రైనా (84), యువరాజ్‌ (48) రాణించడంతో

2008లో దాయాదులు లీగ్‌, నాకౌట్‌ దశల్లో రెండు సార్లు తలపడ్డారు. లీగ్‌లో తొలుత పాక్‌ 299/4 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ (125) సెంచరీ చేశాడు. ఛేదనలో సెహ్వాగ్‌ (119), సురేశ్‌ రైనా (84), యువరాజ్‌ సింగ్‌ (48) రాణించడంతో 42.1 ఓవర్లకే భారత్‌ విజయం సాధించింది. నాకౌట్‌ మ్యాచ్‌లో మాత్రం పాక్‌దే పైచేయి. భారత్‌ తొలుత 308 పరుగులు చేయగా యూనిస్‌ ఖాన్‌ అజేయ సెంచరీతో పాక్‌ గెలిచింది.

కోహ్లీ, సచిన్‌, రోహిత్‌ శర్మలు:

కోహ్లీ, సచిన్‌, రోహిత్‌ శర్మలు:

2010లో టీమిండియా 3 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. దాయాది తొలుత 267 పరుగులు చేసింది. గంభీర్‌ (83), ధోనీ (56) ధాటిగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. 2012 ఆసియా కప్‌ విరాట్‌ కోహ్లీకి ప్రత్యేకం. 3 మ్యాచుల్లో అతడు 357 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్‌ తొలుత 329 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఛేదన వీరుడు విరాట్‌ కోహ్లీ (183), సచిన్‌ (52), రోహిత్‌ శర్మ (68) జట్టును విజయతీరాలకు చేర్చారు.

అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో:

అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో:

2016లో ఆసియా కప్‌ను ప్రయోగాత్మకంగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా బౌలర్లు అతితక్కువ స్కోరు 83కు ఆలౌట్‌ చేశారు. ఓపెనర్లు రోహిత్‌, రహానె డకౌట్‌ అయినా విరాట్‌ కోహ్లీ 49 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. 2018లో భారత్‌, పాక్‌ మూడు సార్లు తలపడే అవకాశాలున్నాయి. గ్రూప్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు చేరతాయి. అందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.

Story first published: Sunday, September 16, 2018, 17:17 [IST]
Other articles published on Sep 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+