Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారిద్దరూ క్రీజ్‌లో ఉన్నా చాలు - బౌలర్లకు రుధిరమే..!!

The Incredible Virat Kohli and Suryakumar Yadav partnership in T20Is in the 2022

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంకాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లాండ్‌తో తలపడటానికి సమాయాత్తమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి- ఫైనల్‌లో అడుగు పెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా. దీనికోసం కఠోరంగా శ్రమించింది. 2007 తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడానికి రెండే రెండు అడుగుల దూరంలో నిలిచింది.

ట్విస్టుల మీద ట్విస్టులు..

ట్విస్టుల మీద ట్విస్టులు..

భారత్-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో జరగబోతోన్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్స్ ఆడుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనూహ్య పరిస్థితులు, అనేక ట్విస్టుల తరువాత పాకిస్తాన్.. ఫైనల్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు ప్లస్ పాయింట్. అదే సమయంలో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది.

ఎవరు మెరుస్తారు..?

ఎవరు మెరుస్తారు..?

ఇంకొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోన్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు మెరుస్తారు? ఏ బ్యాటర్ సత్తా చాటుతాడు?.. జట్టును విజయతీరాలకు చేర్చేదెవరనే డిబేట్స్ ఆసక్తికరంగా సాగుతున్నాయి.. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం అత్యంత బలోపేతంగా ఉన్న నేపథ్యంలో ఓపెనర్ దగ్గరి నుంచి లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ వరకూ ప్రతి ఒక్కరూ రాణించగలరనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

కోహ్లీ రికార్డ్స్..

కోహ్లీ రికార్డ్స్..

ఈ పరిస్థితుల మధ్య ప్రస్తుతం అందరి దృష్టి కూడా ప్రత్యేకించి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మీదే నిలిచాయి. ఈ ఇద్దరూ ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడుతోన్నారు. అంచనాలకు మించి రాణిస్తోన్నారు. సూపర్ 12 దశలో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ప్రదర్శించిన విశ్వరూపాన్ని ఇప్పటికీ ఎవరూ మరిచిపోవట్లేదు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆడిన రెండు సిక్సర్లు చాలామంది అభిమానుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.

సూర్యకుమార్‌దీ అదే స్థితి..

సూర్యకుమార్‌దీ అదే స్థితి..

సూర్యకుమార్ యాదవ్‌ పరిస్థితి అంతే. ఈ టోర్నమెంట్‌లో అతని హవా నడుస్తోంది. ఇంగ్లాండ్‌పైనా మంచి ట్రాక్ రికార్డ్ ఉందతనికి. ఇంగ్లాండ్‌తో ఇప్పటివరకు అయిదు ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్. 260 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా. ఉంది. ఒక అర్ధసెంచరీనీ బాదాడు. బ్యాటింగ్ సగటు 52గా నమోదైంది. 195.40 స్ట్రైక్ రేట్‌ను అందుకున్నాడీ బ్యాటర్ ఇంగ్లాండ్ జట్టుపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో.

 ఇద్దరూ కలిస్తే..

ఇద్దరూ కలిస్తే..

అలాంటిది వీరిద్దరూ కలిస్తే ఇక స్టేడియంలో ఏర్పడేది మినీ సునామీయే అనడంలో సందేహాలు అక్కర్లేదు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. ఈ ఏడాది మొత్తం మీద వీరిద్దరి దూకుడు కొనసాగుతోంది. కోహ్లీ-సూర్యకుమార్ యాదవ్ పార్ట్‌నర్‌‌షిప్ అద్దిరిపోయే గణాంకాలను చూపిస్తోంది. 24.5 శాతం లోయెస్ట్ డాట్ బాల్స్ ఉన్నది వీరిద్దరి పేరు మీదే. అలాగే- ప్రతి నాలుగు బంతులకూ ఓ బౌండరీ సాధించారు వీరిద్దరూ.

ఈ ఏడాదిలో..

ఈ ఏడాదిలో..

ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోహ్లీ- సూర్యకుమార్ యాదవ్ 10 ఇన్నింగ్స్ ఆడారు. 516 పరుగులను బౌలర్ల నుంచి పిండుకున్నారు. బ్యాటింగ్ యావరేజ్ 64.5 శాతంగా నమోదు చేశారు. ఓవర్‌కు 11.2 పరుగులు చొప్పున రాబట్టుకున్నారు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు కోహ్లీ 246 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ 225 పరుగులు.

Story first published: Thursday, November 10, 2022, 12:52 [IST]
Other articles published on Nov 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+