For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ చరిత్ర తెలుసుకోండి: అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

యాషెస్... టెస్టు క్రికెట్‌లోనే అతిపెద్ద సంగ్రామంగా భావిస్తారు. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్‌ అభిమాని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా చూసే సిరిస్ ఇది.

By Nageshwara Rao

హైదరాబాద్: యాషెస్... టెస్టు క్రికెట్‌లోనే అతిపెద్ద సంగ్రామంగా భావిస్తారు. దేశాలతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్‌ అభిమాని ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా చూసే సిరిస్ ఇది. క్రికెట్ గురించి తెలియని చాలా మంది యాషెస్ అంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిరీస్‌ టెస్టు సిరిస్‌గా భావిస్తారు. కానీ ఆ రెండు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఈ సిరిస్‌ను ఓ యుద్ధంలా చూస్తారు.

యాషెస్ సిరిస్ ఎంతో ప్రతిష్టాత్మకం

యాషెస్ సిరిస్ ఎంతో ప్రతిష్టాత్మకం

ఈ సిరిస్‌ను రెండు జట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ మహా సంగ్రామం నవంబర్ 23 (గురువారం) బ్రిస్బేనే వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. యాషెస్‌కు 135 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ సిరిస్‌ ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లకు ఎంతో భావోద్వేగాలతో కూడుకున్నది. అందువల్లే యాషెస్ అంటే ఓ చరిత్ర. చాలా మందికి యాషెస్ చరిత్ర తెలియదు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్‌కు యాషెస్ అనే పేరు కాడా చాలా చిత్రంగా వచ్చింది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది.

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్

క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లాండ్

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు క్రికెట్‌ తొలినాళ్లలో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం. అయితే 1882లో అంటే సరిగ్గా 135 ఏళ్ల కిందట ఇంగ్లాండ్ ఆధిపత్యానికి ఆసీస్ అడ్డుకట్ట వేసింది. ఆ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా.. వాళ్లను సొంతగడ్డపైనే ఓడించింది. దీనిపై అక్కడి మీడియా ఇంగ్లిష్ క్రికెట్ చచ్చిపోయిందని, శరీరాన్ని కాల్చి బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారని టైమ్స్ పత్రిక అప్పట్లో పెద్దఎత్తున వార్తాకథనాన్ని రాసింది. ఆ తర్వాత అదే ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ కెప్టెన్ బ్లిగ్.. ఆ బూడిదతోపాటు ఇంగ్లిష్ క్రికెట్ గౌరవాన్ని కూడా తిరిగి తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

ఓ చిన్న కప్పులో బూడిదను వేసి

ఓ చిన్న కప్పులో బూడిదను వేసి

1882-83లో రూపర్ట్‌వుడ్స్ మాన్షన్‌లో జరిగిన ఓ ప్రెండ్లీ మ్యాచ్‌లో అక్కడి మహిళల బృందం ఓ చిన్న కప్పులో ఆ బూడిదను వేసి ఇచ్చారు. ఆ బూడిద ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన మ్యాచ్‌లో స్టంప్స్‌పై వాడిన ఓ బెయిల్‌ది అని చెబుతుంటారు. ఇలా ఆ ఘటన ఓ పెద్ద 'బూడిద' సంగ్రామానికి దారి తీసింది. ఆ తర్వాత యాషెస్ ఇరు దేశాలకు సంబంధించి పరువు ప్రతిష్టలకు ముడిపెట్టడంతో అదికాస్తా ప్రతిష్టాత్మక సిరీస్‌గా మారిపోయింది. ప్రతి రెండేళ్లకోసారి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఈ సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్నాయి.

మాటలతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సిద్ధం

మాటలతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సిద్ధం

నిజానికి యాషెస్ సిరిస్ మొదలవుతోందంటే.. మైదానంలో కంటే ముందే మాటలతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సిద్ధమవుతారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌‌ ఫలితాన్ని తొలి టెస్టు నిర్దేశిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరు జట్లకూ బలాలు, బలహీనతలు సమానంగా ఉన్న నేపథ్యంలో మైదానంలో ఎవరెలా ఆడతారన్న దానిపైనే ప్రదానంగా ఆధారపడిఉంది. తొలి టెస్టు జరిగే గబ్బా స్టేడియంలో గత 31 ఏళ్లుగా ఆసీస్ ఓటమనేది ఎరుగలేదు. ఈ రికార్డును కొనసాగించడం ఆస్ట్రేలియాకు ఎంతో కీలకంగా మారింది. తొలిటెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం ఆసీస్‌ సిరీస్‌ మీద ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

Captains Root and Smith could decide Ashes - Siddle
యాషెస్ సిరిస్ కోసం జట్లు:

యాషెస్ సిరిస్ కోసం జట్లు:

ఆస్ట్రేలియా: స్టీవెన్‌ స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్‌, ఖవాజా, హాండ్స్‌కాంబ్‌, షాన్‌ మార్ష్‌, బాన్‌క్రాఫ్ట్‌, టిమ్‌ పైన్‌, స్టార్క్‌, కమిన్స్‌, జాక్సన్‌ బర్డ్‌, లైయన్‌, చాడ్‌ సేయర్స్‌

ఇంగ్లాండ్‌: రూట్‌, కుక్‌, బాలెన్స్‌, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, బెన్‌ ఫోక్స్‌, బ్రాడ్‌, అండర్సన్‌, జేక్‌ బాల్‌, వోక్స్‌, క్రేన్‌, జార్జ్‌ గార్టన్‌, మలన్‌, ఓవర్టన్‌, స్టోన్‌మన్‌, విన్స్‌.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 22, 2017, 17:46 [IST]
Other articles published on Nov 22, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+