ఎందుకంటే
అసలు దీనికి గల కారణమెంటంటే మెగా వేలంలో చెన్నైసూపర్ కింగ్స్ శ్రీలంక ఆటగాడు మహీశు తీక్షణను కొనుగోలు చేయడమే. శ్రీలంకకు చెందిన మహీశు తీక్షణ తమ జట్టులో ఉండడాన్ని తమిళులు ఇష్టపడడం లేదు. కాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమిళనాడుకు చెందినదనే సంగతి తెలిసిందే. దీంతో మహీశు తీక్షణను వెంటనే జట్టు నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో తమిళులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో చెన్నైసూపర్ కింగ్స్ జట్టునే నిషేధిస్తామని, #బాయ్‌కాట్ చెన్నైసూపర్ కింగ్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. కాగా రైట్ హ్యాండ్ మీడియం పేసర్ అయిన మహీశ్ తీక్షణను ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నైసూపర్ కింగ్స్ 70 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

అసలు గొడవ ఏంటి
శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దారుణాల కారణంగా అక్కడి జనాలు లంకేయులను శత్రువులుగా భావిస్తారు. అందుకే శ్రీలంక క్రికెటర్లపై కూడా వారి ద్వేషం కొనసాగుతుంటుంది. గతంలో శ్రీలంకలోని తమిళులపై అక్కడి వాళ్లు చేసిన దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చాలా కాలంగా తమిళనాడుకు, శ్రీలంకకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం సీఎస్‌కేకి ఎంపికైన తీక్షణ.. శ్రీలంక ఆర్మీ జవాన్‌గా కూడా పనిచేస్తున్నాడు. దీంతో అతడిని టీం నుంచి తొలగించాల్సిందేనని ‘బాయ్ కాట్ చెన్నై సూపర్ కింగ్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ స్థాయిలో వ్యతిరేకతం వ్యక్తం అవుతుండడంతో మహీశ్ తీక్షణను సీఎస్కే జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది.

విజయ్ సేతుపతి సినిమాపై ఎఫెక్ట్
అయితే తమిళులు ఇలా నిరసన తెలపడం కొత్తేం కాదు. గతంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు. సినిమాకు 800 అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఇంతలోనే తమిళ ప్రజల నుంచి విజయ్ సేతుపతిపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో చేసేదేమి లేక విజయ్ సేతుపతి ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక సినిమా కూడా ఆగిపోయింది.

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు:
ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయడు, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, దీపక్ చాహర్, కెఎమ్ ఆసిఫ్, శివమ్ దూబే, మహీశ్ తీక్షణ, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, సిమర్‌జీత్ సింగ్, డివోన్ కాన్‌టోరియస్, డివోన్ కాన్టోరియస్ , మిచ్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సుభ్రాంశు సేనాపతి, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సి హరి నిశాంత్, ఎన్ జగదీశన్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ.


Click it and Unblock the Notifications












