
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన గర్ల్‌ప్రెండ్ సనాయా తకరివాలాతో ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని కరుణ్ నాయర్ స్వయంగా వెల్లడించాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కరుణ్ నాయర్‌ను సనాయా తకరివాలా ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. "అవును, ఆమె నాకు యస్ చెప్పింది" అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఫోటోలో సనాయా చేతికి కరుణ్ తొడిగిన ఉంగరం కూడా ఉంది. చెన్నై వేదికగా 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు.
తద్వార టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ తర్వాత భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు. కరుణ్ నాయర్ జింబాబ్వే జట్టుపై హరారే స్పోర్ట్స్ క్లబ్లో 11 జూన్ 2016న జరిగిన మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేశాడు.
26 నవంబరు 2016న మొహాలీలో ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టీమిండియా తరుపున రెండు వన్డేలాడిన కరుణ్ నాయర్ 46 పరుగులు చేశాడు. ఇక, ఐపీఎల్‌లో ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.