
ప్లేయర్ ఆఫ్ ద సిరిస్‌గా:
ఇదే ఆత్మవిశ్వాసంతో టి20ల్లోనూ ముందడుగు వేస్తానని చెప్పింది. స్మృతి మంధాన, వేద, జెమీమాలు కూడా నిలకడగా రాణిస్తుండటంతో తనపై బ్యాటింగ్ భారం తగ్గిందని తెలిపింది.
మ్యాచ్‌లు గెలిపించే ఇన్నింగ్స్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచింది. జట్టు సన్నాహాలపై ఆమె మాటల్లోనే...

కేవలం ఐదారుగురు ఆడితే గెలవలేం:
జట్టులో ఐదారుగురు ఆడితే సరిపోదు. అందరు సమష్టిగా రాణించాలి. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా తమ వంతు పరుగులు సాధించిపెట్టాలి. టాప్, మిడిలార్డర్ విఫలమైనపుడు వీళ్లు చేసే స్కోర్లే కీలకమవుతాయి. వెస్టిండీస్‌లో అక్టోబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో స్పిన్నర్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు.

కెప్టెన్‌తో పాటు టీనేజ్ సంచలనం జెమీమా:
ఇదే తరహాలో కొనసాగితే భవిష్యత్‌లో భారత మహిళా జట్టు మంచి స్థాయిలో ఉంటుంది. ఇటీవల మహిళా క్రికెట్‌కు సైతం ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో మా టార్గెట్ అక్టోబరులో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మీదే ఉంది. హర్మన్‌ప్రీత్ (టి20 కెప్టెన్), వేద కృష్ణమూర్తి, టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌లు నిలకడగా రాణిస్తున్నారు.

నా పై భారం తగ్గింది:
ప్రధానంగా బ్యాటింగ్ భారమంతా నా మీదే లేదు. స్వేచ్ఛగా నా ఆటతీరు కొనసాగించే వీలు చిక్కింది. ఆచితూచి ఆడటం కన్నా... ప్రయోగాత్మక షాట్లు ఆడేందుకు ఇదో కారణం. ఔట్ అవుతాననే బెంగేలేకుండా ఆడగలుగుతున్నా' అంటూ భారత భవిష్యత్ మహిళా క్రికెట్ గురించి విశ్లేషించింది.

టీ20ల్లోనూ ఆడగలను:
జట్టు గురించి మాట్లాడుతూ.. 'మేము అత్యుత్తమ వన్డే జట్టుగా దూసుకెళ్తున్నాం. అయినా, నాకు టీ20 సిరీస్‌లంటే అమితాసక్తి లేదు. అయితే టి20 ప్రపంచకప్ లక్ష్యంగా సన్నాహాలకు పదును పెట్టడం వల్లే ఈ ప్రదర్శన సాధ్యమైంది. ఇప్పుడు నేను కూడా టి20 ప్లేయర్‌ననే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఓపెనర్‌గా నేను ధాటిగా ఆడేందుకు మంచి అవకాశం దొరికింది.

ఇదే కొనసాగిస్తా:
మొదటి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) చాలా కీలకం. జట్టుకు శుభారంభమిచ్చే అవకాశం ఇక్కడే మొదలవుతుంది. పొట్టి ఫార్మాట్‌లో విదేశీగడ్డపై నేను ఓపెనర్‌గా విజయవంతమయ్యాను. ఇదే ఉత్సాహాన్ని తదుపరి సిరీస్‌లలో కొనసాగిస్తా' అని తెలిపింది.


Click it and Unblock the Notifications












