Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Vs Newzealand 1st Test: లార్డ్స్ టెస్ట్‌లో తొలిరోజే 17వికెట్లు, టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ ఢమాల్

The first Test between England and New Zealand turned Interesting with 17wickets in hand on the first day

లార్డ్స్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132పరుగులకే కుప్పకూలింది. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలుత బాగా ఆడింది. మూడో సెషన్ టీ బ్రేక్ సమయానికి 23ఓవర్లలో వికెట్ నష్టానికి 75పరుగులు చేసింది. జాకీ క్రాలీ(43) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే టీ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ ఆట పూర్తిగా మారిపోయింది. కైలీ జేమీసన్, డి గ్రాండ్ హోమ్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ.. స్వింగర్లు, లైన్ అండ్ లెంత్ బాల్స్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో అలెక్స్ లీస్(25), ఓలీ పోప్ (7), జో రూట్ (11), జానీ బెయిర్ స్టో (1), కెప్టెన్ బెన్ స్టోక్స్ (1), మాథ్యు పాట్స్ (0), క్రీజులో నిలవలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7వికెట్లు కోల్పోయి 116పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ ఫోక్స్ (6), స్టువర్ట్ బ్రాడ్ (4) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2, బౌల్ట్ 2, జేమీసన్ 2, గ్రాండ్ హోమ్ 1 వికెట్ తీశారు. ఇక ఒక్క రోజే లార్డ్స్ టెస్ట్‌లో 17వికెట్లు పడడం గమనార్హం. దీన్ని బట్టి లార్డ్స్ పిచ్ పూర్తిగా బౌలింగ్ పిచ్ అని అర్థం అవుతుంది. ఇకపోతే ఇంగ్లాండ్ పతనానికి క్రాలీ వికెట్‌తో జేమీసన్ పాదుకొల్పాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా లయ అందుకున్నారు.

అంతకుముందు ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి నిలవలేక కివీస్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌తోనే ఇంగ్లాండ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జేమ్స్‌ అండర్సన్‌(4/66), అరంగేట్ర బౌలర్‌ మాథ్యూ పాట్స్‌(4/13) నాలుగేసి వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. ఈ ఇద్దరి ధాటికి న్యూజిలాండ్‌ బ్యాటర్లు వరుసగా 1,1, 2, 3, 13, 14, 42,6, 26, 7, 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు టామ్ లాథమ్(1), విల్ యంగ్‌(1)లను అండర్సన్ ఔట్ చేయగా.. విలియమ్సన్‌(2 ) మాథ్యూ ప్యాట్స్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. డేవాన్ కాన్వే(3) స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్, టామ్ బండెల్‌లను పాట్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దాంతో 100పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కొలిన్ గ్రాండ్ హోమ్(42 నాటౌట్) ఒంటి పోరాటం చేశాడు. అతనికి టీమ్ సౌథీ(26) అండగా నిలిచాడు. దీంతో కివీస్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్‌, మాథ్యూ పాట్స్‌ నాలుగేసి వికెట్లు తీయగా.., స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒకటి, బెన్‌ స్టోక్స్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

Story first published: Friday, June 3, 2022, 8:00 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+