Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా కీరన్ పొలార్డ్.. ఎంతటి తోపు ఆల్రౌండరంటే..!

The First Player To Reach 600 T20 Matches is Kieron Pollard

వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ సోమవారం తన 600వ టీ20 మ్యాచ్‌ ఆడాడు. తద్వారా 600 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. లార్డ్స్‌లో కొనసాగుతున్న ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన లండన్ స్పిరిట్ మ్యాచ్‌లో పొలార్డ్ ఈ మైలురాయికి చేరుకున్నాడు. పొలార్డ్ 600వ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అతను కేవలం 11బంతుల్లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లతో 34పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ గణాంకాలే సాక్ష్యం

ఈ గణాంకాలే సాక్ష్యం

పొలార్డ్ క్రికెట్ కెరీర్లో అద్భుతమైన టీ20 గణాంకాలున్నాయి. అతను 600మ్యాచ్‌లలో 31.34 సగటుతో 11,723పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 104. పొలార్డ్ ఒక సెంచరీతో సహా 56హాఫ్ సెంచరీలు తన టీ20కెరీర్లో సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/15. అలాగే 309వికెట్లు కూడా సాధించాడు. ఈ గణాంకాలు చాటుతాయి.. అతను టీ20 క్రికెట్లో ఎంత తోపు ఆల్రౌండరో చెప్పడానికి.

అనేక లీగ్‌లలో పొలార్డ్ మార్క్

అనేక లీగ్‌లలో పొలార్డ్ మార్క్

ఇక పొలార్డ్ సంవత్సరాలుగా అనేక టీ20 జట్లు / ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా లీగ్‌లలో తనదైన మార్క్ చూపించాడు. అతను వెస్టిండీస్ జాతీయ జట్టుకు ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఆడాడు. అలాగే దేశీయ జట్టు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పొలార్డ్‌కు ఉన్న క్రేజ్ ఎంటో అందరికీ తెలిసిందే.

అయిదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టులో అతనో రెగ్యులర్ మరియు కీలక ప్లేయర్. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ మరియు మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా గ్లాడియేటర్స్, ఢాకా డైనమైట్స్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ తరఫున ఆడాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఇంకా తదితర జట్లకు అతను ఆడాడు.

పొలార్డ్ తర్వాత అత్యధిక టీ20లు ఆడినవారు..

పొలార్డ్ తర్వాత అత్యధిక టీ20లు ఆడినవారు..

ఇకపోతే టీ20 కెరీర్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో పొలార్డ్ 600 మ్యాచులతో తొలి స్థానంలో ఉండగా.. అతని తర్వాత డ్వేన్ బ్రావో (543 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్ (472), క్రిస్ గేల్ (463), రవి బొపారా (426) ఉన్నారు. ఇక లండన్ వర్సెస్ మాంచెస్టర్ మ్యాచ్ విషయానికి వస్తే.. పొలార్డ్ చివర్లో భీకర దాడి చేయడంతో లండన్ 100బంతుల్లో 160/6 చేసింది.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (37), ఓపెనర్ జాక్ క్రాలే (41) కూడా సహకారం అందించారు. మాంచెస్టర్ ఒరిజినల్స్ కేవలం 108పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 52పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

Story first published: Tuesday, August 9, 2022, 21:55 [IST]
Other articles published on Aug 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+