T20 World Cup 2022: వారి ఆనందానికి అవధులు లేవు.. వైరల్‍గా మారిన జింబాబ్వే అభిమానుల వీడియో..

టీ20 వరల్డ్ కప్ 2022లో జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసింది. పెర్త్ లో పాకిస్థాన్ తో జరిగిన సూపర్-12 మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. అయితే పాక్ ను జింబాబ్వే ఓడగొడుతుందని ఎవరూ ఊహించలేదు. చివరికి జింబాబ్వే అభిమానులు కూడా తమ దేశం గెలుస్తుందని అనుకోలేదు. కానీ ఒక్క పరుగు తేడాతో తమ దేశం విజయం సాధించండంతో జింబాబ్వే అభిమానులు పండుగు చేసుకున్నారు. ఓ రేస్టారెంట్ లో మ్యాచ్ చూస్తున్న జింబాబ్వే అభిమానులు మ్యాచ్ గెలవగానే.. ఆనందంతో గంతేశారు.
షాహీన్ షా అఫ్రిదీ
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. షాహీన్ షా అఫ్రిదీ రెండో పరుగు చేయడానికి ప్రయత్నించగా ఔటయ్యాడు. దీంతో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే గెలుపుతో ఆ దేశ అభిమానులు స్టేడియంలోకి వెళ్లి చిందులు వేశారు. కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులుచేసింది. ఓపెనర్లు కాస్త ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మాధేవేరే 17 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ క్రెయిగ్ ఎర్విన్ 19 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ల్యూక్ జోంగ్వే
131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. జింబాబ్వే సికిందర్ రజా 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్లు తీయగా.. ల్యూక్ జోంగ్వే, ముజారబానీని ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం టాప్ కమేడియన్ మిస్టర్ బీన్ అలియాస్ రొవాన్ అట్కిన్సన్ పేరుతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మిస్టర్ బీన్ పదాన్ని స్వయంగా జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా సైతం ఉపయోగించాల్సి వచ్చిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆసిఫ్ మహ్మద్
2016లో జింబాబ్వే రాజధాని హారారెలోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఓ కామెడీ షో సందర్భంగా ఆ దేశ ప్రజలను అవమానపరిచింది పాకిస్తాన్. హరారె రోడ్‌షోలో మిస్టర్ బీన్ అలియాస్ రొమన్ అట్కిన్సన్‌కు బదులుగా ఆయన రూపాన్ని పోలిన పాకిస్తాన్ కమేడియన్ ఆసిఫ్ మహ్మద్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతణ్నే రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు జింబాబ్వే ప్రజలు. అతనితో చేతులు కలపడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీనికోసం 10 డాలర్లను చెల్లించారు. ఆ తరువాత నిజం తెలిసి లబోదిబోమన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications