ఐయామ్ రెడీ: తొలి ప్రచారానికి శ్రీకారం చుట్టిన విరాట్ కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ దిగ్గజం అమెరికన్ టూరిస్టర్ ప్రచారం మొదలుపెట్టింది. 'ఐయామ్ రెడీ' పేరుతో తొలి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని యువతను ఆకట్టుకునే విధంగా అమెరికన్ టూరిస్టర్ కోహ్లీతో రూపొందించిన వీడియోని విడుదల చేసింది.
ఈ వీడియోని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ప్రచారం ద్వారా సరికొత్త 'బ్యాక్ ప్యాక్' కలెక్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. కోహ్లీకి దేశ, విదేశాల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అమెరికన్ టూరిస్టర్ గతేడాది డిసెంబర్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

ఈ కంపెనీకి భారత్‌లో తొలి బ్రాండ్ అంబాసిడర్ కోహ్లీ కావడం విశేషం. భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో అమెరికన్ టూరిస్టర్ ఉత్పత్తులకు కోహ్లీ ప్రచారం చేయనున్నాడు. కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతో తమ ఉత్పత్తులు విపరీతంగా అమ్ముడుపోవడం ఖాయమని కంపెనీ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications