Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క క్యాచ్‌తో కోహ్లీ నోరెళ్లబెట్టాడు (వీడియో)

Trent Boult boasts a collection

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫీల్డర్ ట్రెంట్ బౌల్ట్ పట్టిన క్యాచ్ ఐపీఎల్-11 సీజన్‌లో హైలెట్‌గా నిలిచింది. బౌండరీకి యత్నించిన కోహ్లీ అనూహ్య రీతిలో బౌల్ట్ పట్టిన క్యాచ్‌కు నోరెళ్లబెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌కు సహకారం అందిస్తూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు.

ఏబీ మైదానం నలువైపులా బౌండరీలతో విరుచుకుపడటంతో బెంగళూరు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 10 ఓవర్లకు 82/2 తో ఆర్‌సీబీ పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఈ సమయంలో ఢిల్లీ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన తరువాతి ఓవర్‌లో ఫుల్‌టాస్ వేసిన బంతిని కోహ్లీ భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్ వెళ్తుందనుకున్న తరుణంలో బౌల్ట్ కళ్లు చెదిరే క్యాచ్‌కు విరాట్ వెనుదిరగాల్సి వచ్చింది.

ఒంటి చేత్తో బంతిని అందుకున్న బౌల్ట్ అదుపు తప్పి బౌండరీ లైన్‌కు కేవలం మిల్లీమీటర్ దూరంలో ఆగిపోయాడు. దీన్ని చూసిన విరాట్ నోరెళ్లబెట్టాడు. ఇలాంటి క్యాచ్‌ను తాను గతంలో ఎప్పుడూ చూడలేదని ఢిల్లీ కెప్టెన్ గౌతం గంభీర్ మ్యాచ్ అనంతరం ప్రత్యేకంగా తెలపడం విశేషం. డివిలియర్స్(90) మెరుపులతో బెంగళూరు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

అయితే అప్పటికే లైన్‌ వద్ద ఉన్న కాసుకుని ఉన్న బౌల్ట్‌.. బంతి గాల్లో ఉండగానే అమాంతం ఎగిరిన కుడి చేత్తో ఒడిసి పట్టేశాడు. ఆపై బౌండరీ లైన్‌పై పడకుండా బాడీని బ్యాలెన్స్‌ చేశాడు. ఊహించని ఆ క్యాచ్‌కు కోహ్లి కంగుతినగా.. ఎంపైర్లు రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించారు. ఇక రిప్లైలో అది అవుటని తేలింది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అఫీషియల్‌ ఈ సీజన్‌కు ఇప్పటిదాకా ఇదే ఉత్తమ క్యాచ్‌ అని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తూ పలువురు ట్రెంట్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. డేవిడ్‌ లాయ్‌, మైకేల్‌ వా, షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజాలతోపాటు బెన్‌ స్ట్రోక్స్‌.. ఆకాశ్‌ చోప్రా, అలెక్స్‌ హేల్స్‌ కూడా ట్రెంట్‌ బౌల్ట్‌ పై లైఫ్‌ టైమ్‌ క్యాచ్‌ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Story first published: Sunday, April 22, 2018, 13:44 [IST]
Other articles published on Apr 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+