For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Squad for Ireland tour: కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ ఎంట్రీ.. పంత్‌‌కు టాటా..! వివరాలివే

The BCCI has named Hardik Pandya as the captain of Team India for the Ireland Tour

ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదికే గుజరాత్ టైటాన్స్‌‌కు టైటిల్‌ అందించిన హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 26న మలాహిడ్‌లో ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు అతన్ని కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. అలాగే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా పేర్కొంది. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు మిస్సయిన సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ సైతం జట్టులోకి ఈ సిరీస్ ద్వారా అడుగిడనున్నారు. శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా సభ్యులు దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు ఎంపికయిన ప్లేయర్లే కావడం గమనార్హం. ఇక హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా జూన్ 26, 28తేదీల్లో 2 టీ20లు ఐర్లాండ్‌తో ఆడనుంది.

రిషబ్ పంత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో

రిషబ్ పంత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుండడంతో

ఇక దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 19న పూర్తి అవుతుంది. ఈ సిరీస్‌కు ప్రస్తుతం రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్, టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని సీనియర్ టీం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

ఇక ఇంగ్లాండ్ పర్యటనకు రిషబ్ పంత్ సైతం వెళ్లనున్నాడు. అందువల్ల అతను కెప్టెన్సీకి టాటా చెప్పాల్సి వచ్చింది. దీంతో హార్దిక్ పాండ్యాకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. 17మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఐర్లాండ్ పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా

ఐర్లాండ్ పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా

ఐర్లాండ్‌లో జరిగే 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం వీరు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లుగా వ్యవహరిస్తుండగా, ఎన్సీఏ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇంతకుముందు ఇండియా Aజట్టుకు కోచ్‌గా పనిచేసిన కోటక్ ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో కరీబియన్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా జట్టు కోచింగ్ స్టాఫ్‌లో పనిచేసిన బాలి ఫీల్డింగ్ కోచ్‌గా, బహుతులే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

బర్మింగ్‌హమ్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్

బర్మింగ్‌హమ్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్

ఇక ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో నాలుగు రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ జూన్ 24 నుంచి 27వరకు జరగనుంది. ఇక ఆ తర్వాత బర్మింగ్ హామ్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్ జరగనుంది. జులై 1 నుంచి జులై 5వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ టీమిండియాతో తలపడడానికి సిద్ధమవుతుంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమిండియా టీ20 జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లాండ్‌తో 5వ టెస్ట్‌కు ఎంపికైన టీమిండియా జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ కృష్ణ

Story first published: Wednesday, June 15, 2022, 21:40 [IST]
Other articles published on Jun 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+