
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది వీరే
ఈ ఏడాది అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ ఏడాది 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 62 సగటుతో 1630 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 228 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేసింది రూట్ ఒక్కడే. రూట్ తర్వాత 906 రన్స్‌తో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 11 టెస్టుల్లో 47 సగటుతో ఈ రన్స్ చేశాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ అత్యధిక స్కోర్ 161 పరుగులు.

వన్డేల్లో అత్యధిక పరుగుల లిస్టులో కొత్త ముఖాలు
ఈ ఏడాది అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కొత్త ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు కూడా చిన్న జట్లకు చెందిన వారు కావడం గమానర్హం. ఈ సారి పెద్ద జట్టు ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు ఆడకపోవడమే ఇందుకు కారణం. ఐర్లాండ్‌కు చెందిన స్టిర్లింగ్ ఈ సారి వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ ప్లేసులో ఉన్నాడు.
14 మ్యాచ్‌ల్లో 54 సగటుతో స్టిర్లింగ్ 705 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 131 నాటౌట్. ఆ తర్వాతి స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన మలాన్ 509 పరుగులతో ఉన్నాడు. అతని ఖాతాలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 177 నాటౌట్. అయితే టాప్ 10 లో ఏ ఒక్క భారత ఆటగాడు కూడా లేడు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో మొదటి స్థానంలో పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ 29 మ్యాచ్‌ల్లో 73 సగటుతో ఏకంగా 1326 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతోపాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 104. ఆ తర్వాతి స్థానంలో కూడా పాకిస్థాన్‌కే చెందిన బాబర్ అజామ్ ఉన్నాడు. బాబర్ 29 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 939 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 122. అయితే టీ20ల్లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications












