Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి గ్లౌస్ అందుకున్న వేళ: ఉద్వేగానికి లోనైన బెయిర్ స్టో

The Ashes: Jonny Bairstow blown away by gift of dead father's old gloves

హైదరాబాద్: ఆసీస్ క్రికెట్ అభిమాని ఇచ్చిన బహుమతికి ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఉద్వేగానికి గురయ్యాడు. ఇంతకీ ఆ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? తన తండ్రి ఉపయోగించిన గ్లౌవ్స్. సుమారు 40 ఏళ్ల కిందట జానీ బెయిర్ స్టో తండ్రి డేవిడ్ బెయిర్ స్టో అప్పట్లో వాడిని గ్లోవ్స్‌ను ఆండ్రూ జాన్స్ అనే అభిమానికి ఇచ్చాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు నేపథ్యంలో ఆ అభిమాని తన తండ్రి, ఇంగ్లాండ్ దివంగత వికెట్ కీపర్ డేవిడ్ బెయిర్‌స్టో అప్పట్లో వాడిన గ్లౌవ్స్‌ను జానీ బెయిర్ స్టోకు ఇచ్చాడు. దీంతో తండ్రి గ్లౌస్ అందుకున్న వేళ జానీ బెయిర్ స్టో కాస్తంత ఉద్వేగానికి లోనయ్యాడు.

The Ashes: Jonny Bairstow blown away by gift of dead father's old gloves

అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మూడోరోజు సోమవారం జానీ బెయిర్‌స్టోను కలిసిన ఆండ్రూ ఆ గ్లౌవ్స్‌ను బెయిర్‌స్టోకు ఇచ్చాడు. '40 ఏళ్ల కిందట మా తల్లితండ్రులతో కలిసి షాపింగ్ కాంప్లెక్స్‌కు వెళ్లాను. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుతో యాషెస్‌లో తలపడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లు ఆ మాల్‌లో చిన్న క్విజ్ నిర్వహించారు. ఇంగ్లాండ్ రిజర్వ్ కీపర్ ఎవరు అన్న ప్రశ్నకు నేను డేవిడ్ బెయిర్‌స్టో అని సమాధానం ఇచ్చాను. దీంతో ఆయన తన సంతకంతో కూడిన గ్లౌవ్స్ నాకు బహుమతిగా ఇచ్చాడు' అని జాన్స్ ఆండ్రూ అన్నాడు.

'డేవిడ్ బెయిర్ స్టో గ్లౌవ్స్ ఇచ్చేందుకు బెయిర్‌స్టోను సంప్రదించాను. గ్లౌవ్స్ తీసుకుని నేను వచ్చానంటూ సందేశం పంపాను. అతను రెండు నిమిషాల అనంతరం వచ్చాడు. నాతో అరగంట మాట్లాడాడు. చాలా అద్భుతమైన సమావేశం. ఇప్పటివరకు మా తండ్రికి సంబంధించిన విషయాలను విన్నాను. కానీ నా తండ్రి ఉపయోగించిన వస్తువును అందుకోవడం నాకు ఉద్వేగాన్ని కలిగిస్తోంది' అని బెయిర్‌స్టో అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 6, 2017, 11:26 [IST]
Other articles published on Dec 6, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+