Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊహకే అందడం లేదు: యాషెస్‌లో లియోన్ అద్భుత క్యాచ్ (వీడియో)

The Ashes 2017-18: Nathan Lyon unleashes catch of the series at Adelaide Oval

హైదరాబాద్: క్రికెట్‌లో అప్పుడప్పుడు చోటు చేసుకునే కొన్ని కొన్ని ఫీల్డింగ్ అద్భుతాలు మనల్ని కట్టిపడేస్తాయి. గతంలో ఎన్నోసార్లు మనం ఎన్నో ఫీల్డింగ్ నైపుణ్యాలు, కళ్లు చెదిరే క్యాచ్‌లు చూసుంటాం. అయినా సరే కొత్తగా ఏ ఫీల్డరైనా క్యాచ్ పట్టాడంటే అద్భుతమైన క్యాచ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటాం.

తాజాగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో అలాంటి క్యాచే ఒకటి చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్ బాదిన బంతి దూరంగా వెళ్తుంటే.. బౌలరే అద్భుతంగా డైవ్ చేసి దానిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌ని ఆస్ట్రేలియా అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

యాషెస్ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఆటలో భాగంగా మూడో రోజైన సోమవారం ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. మొయిన్ అలీ బ్యాటింగ్ చేస్తు్న్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ బంతి వేశాడు.

ఆ బంతి మొయిన్ అలీ బ్యాట్ ఎడ్జి తీసుకుని అమాంతం గాల్లోకి లేచింది. అంతే మెరుపు వేగంతో డైవ్ చేసిన లియోన్ బంతిని ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్‌కు అద్భుతమైన క్యాచ్‌తో లియోన్ షాకిచ్చాడు. లియోన్ పట్టిన క్యాచ్ 'ది బెస్ట్ కాట్ అండ్ బౌల్డ్' వికెట్లలో ఒకటిగా నిలిచిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియోని ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది. కాగా, ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 442/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 4, 2017, 16:05 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+