వీడ్కోలు అనేది ఓ కళ: సన్నీ రైట్ కాల్, కపిల్‌పై విమర్శలు, మరి ధోని పరిస్థితి ఏంటో!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. 38 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని సెలక్షన్ కమిటీకి నవంబర్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు ధోని రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
ప్రస్తుతం స్వదేశంలో సఫారీలతో జరుగుతున్న సిరిస్ నుంచి తనకు తానుగా దూరమయ్యాడు. ఇప్పటికే సీనియర్, భారత్-ఏ జట్ల కోసం 45 రోజుల దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూలు, శిక్షణ, డోపింగ్ నిరోధ పరీక్షల ప్రణాళికలను బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జాబితాలో ధోని పేరు లేదు. అంటే అతడు విజయ హాజారే ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడటం లేదు.
దీంతో సెప్టెంబర్ 24 నుంచి జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా మహేంద్ర సింగ్ ధోని అందుబాటులో ఉండడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి క్రికెటర్ ఏదో ఒకరోజు వీడ్కోలు పలకాల్సిందే. అయితే, కొన్నేళ్లుగా ఆటతో వారికి అనుబంధం పెరగడంతో ఆ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోలేరు.

రిటైర్మెంట్‌పై ధోని సంకట స్థితిలో
ప్రస్తుతం ధోని కూడా ఇదే సంకట స్థితిలో ఉన్నాడు. అయితే, మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తరహాలో ఘనంగా వీడ్కోలు పలికే తీరు మిగతా క్రికెటర్లు అనుసరించడం లేదని అభిమానులు అభిప్రాయం. 1987లో పాకిస్థాన్‌పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 37 ఏళ్ల వయసులో గవాస్కర్ తన చివరి టెస్టును ఆడాడు.

సత్తా తగ్గినప్పటికీ కొనసాగిన కపిల్
టీమిండియాకు తొలి వరల్డ్‌కప్ అందించిన మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ 1991లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తనలో సత్తా తగ్గినప్పటికీ చాలా రోజులు క్రికెట్‌లో కొనసాగాడని అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, అతడిని జట్టు నుంచి తప్పించడం ఇష్టం లేని అజహరుద్దీన్ అతడితో కొన్ని ఓవర్లు వేయించి బంతిని స్పిన్నర్లకు ఇచ్చేవాడు.

శ్రీనాథ్ టెస్టు అరంగేట్రానికి అడ్డుగా మారిన కపిల్
అప్పడే అంతర్జాతీయ క్రికెట్‌లో యువ పేసర్‌గా ఎదుగుతోన్న జవగళ్ శ్రీనాథ్‌కు కపిల్ దేవ్ కారణంగా మూడేళ్లపాటు టెస్టుల్లో చోటు దక్కలేదని వాదన కూడా ఉంది. టీమిండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్‌ను ఎలా పంపించాలో సెలక్టర్లకు సైతం అప్పట్లో సతమతమయ్యారంట. 0 ఏళ్లప్పుడు క్రికెట్ నేర్చుకొని, 20 ఏళ్లకు అరంగేట్రం చేసి 35 ఏళ్ల వరకు ఆడి ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత మనం ఎందులో మెరుగో తెలుసుకోకపోతే ఎలా? అని ఓ సీనియర్ క్రికెటర్ ప్రశ్నించాడు.

శ్రీనాథ్ టెస్టు అరంగేట్రానికి అడ్డుగా మారిన కపిల్
అప్పడే అంతర్జాతీయ క్రికెట్‌లో యువ పేసర్‌గా ఎదుగుతోన్న జవగళ్ శ్రీనాథ్‌కు కపిల్ దేవ్ కారణంగా మూడేళ్లపాటు టెస్టుల్లో చోటు దక్కలేదని వాదన కూడా ఉంది. టీమిండియాకు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్‌ను ఎలా పంపించాలో సెలక్టర్లకు సైతం అప్పట్లో సతమతమయ్యారంట. 0 ఏళ్లప్పుడు క్రికెట్ నేర్చుకొని, 20 ఏళ్లకు అరంగేట్రం చేసి 35 ఏళ్ల వరకు ఆడి ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత మనం ఎందులో మెరుగో తెలుసుకోకపోతే ఎలా? అని ఓ సీనియర్ క్రికెటర్ ప్రశ్నించాడు.

ఎవరూ సైలెంట్‌గా గుడ్‌బై చెప్పాలని అనుకోరు
"జట్టు నుంచి తప్పిస్తే కోపం వస్తుంది. తప్పించిన ప్రతిసారీ నిరూపించుకోవాల్సి వస్తుంది. క్రికెట్‌కు దూరం కావాలనుకున్నప్పుడు అందరికీ సచిన్‌లాంటి ఘనమైన వీడ్కోలు లభించకపోవచ్చు. తన గుర్తింపునకు తగిన ఫేర్‌వెల్ కావాలని మాత్రం ఎవరైనా భావిస్తారు. ఎవరూ సైలెంట్‌గా గుడ్‌బై చెప్పాలని అనుకోరు. మనమొక గాలి బుడగలో జీవిస్తున్నాం" అని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఓ క్రికెటర్ అన్నాడు.

ముందే గ్రహించిన గంగూలీ, ద్రవిడ్
సునీల్ గవాస్కర్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. అచ్చం అతడిలాగే మరికొందరు క్రికెటర్లు కూడా సరైన సమయంలో కాల్ తీసుకున్న వారిలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లను చెప్పుకొవచ్చు. గ్రెగ్ ఛాపెల్ కోచింగ్‌లో తీవ్రమైన ఇబ్బందులు పడిన సౌరవ్ గంగూలీ తన కెరీర్‌లో చివరి రెండేళ్లు అద్భుతంగా ఆడాడు. 2008లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక, 2011లో రాహుల్ ద్రవిడ్ కూడా వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ సంకేతాలను ముందుగానే అర్థం చేసుకున్నాడు. ఓ మంచి టెస్టు సిరీస్ తర్వాత హఠాత్తుగా వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఆరు నెలల తర్వాత ఆస్ట్రేలియాలో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలోని టీమిండియా టెస్టు సిరిస్‌ను కోల్పోవడంతో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.

టెండూల్కర్ వీడ్కోలు మాత్రం భిన్నంగా
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మాత్రం భిన్నంగా జరిగింది. సచిన్ తన చివరి దశలో సెంచరీలు బాదలేకపోయినప్పటికీ పరుగులు మాత్రం సాధించాడు. వన్డే జట్టులో యువ క్రికెటర్లు చోటివ్వాలనిసెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ చెప్పడంతో 2012లో సచిన్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు మాత్రం రిటైర్మెంట్ పరిస్థితిని ఆలస్యంగా గ్రహించారు. అవకాశాలు కోసం ఎదురు చూశారు. చివరకు చేసేదేమీ లేక వీడ్కోలు పలికారు.

ధోని కూడా ఆ స్థితిలోనే
ఇప్పుడు ధోని కూడా ఆ స్థితిలోనే ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ తరుపున ఏ కెప్టెన్ కూడా సాధించని అరుదైన ఘనతను ధోని సాధించాడు. ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన టోర్నీలకు సంబంధించిన ట్రోఫీలను నెగ్గిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. సాధారణంగా ఎప్పుడేం చేయాలో ధోనీ బాగా తెలుసని అందరూ అంటారు. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోని తన రిటైర్మెంట్ విషయంపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications