ఎంతో తెలుసా?: కోహ్లీ ఇనిస్టాగ్రామ్ పోస్టు చాలా ఖరీదు
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో భారీ బ్రాండింగ్ విలువ ఉన్న ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఎన్నో కార్పోరేట్ సంస్థలు కోహ్లీతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోహ్లీ ప్యూమా, ఎంఆర్‌ఎఫ్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
అయితే, తాను సేవించనటువంటి శీతల పానీయాల గురించి ప్రచారం చేయలేనని పెద్ద మొత్తంలో డబ్బులిస్తామన్నా పెప్సీకోతో ఒప్పందం కుదుర్చుకోని విషయం తెలిసిందే. తాజాగా, బ్రాండ్ విలువలో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని సైతం దాటేశాడు.

ఇనిస్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తే రూ. 3.2 కోట్లు
తాజాగా సోషల్ మీడియాలో కూడా కోహ్లీ ప్రచారం ఊపందుకుంది. ఏదైనా ఉత్పత్తి గురించి కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తే దానికి సుమారు రూ. 3.2 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. కోహ్లీని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో 16.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

ఒక్క రోజుకు రూ 2.5 నుంచి రూ 4 కోట్లు
ఇక సాధారణ యాడ్‌ల విషయానికి వస్తే ఒక్క రోజుకు గాను రూ.2.5 నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో కోహ్లీసేన 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2-1తో కివీస్‌పై సిరిస్ గెలిచిన కోహ్లీసేన
దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 8 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 67 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (8), శిఖర్ ధావన్ (6), విరాట్ కోహ్లీ (13), అయ్యర్ (6), మనీష్ పాండే (17), హార్థిక్ పాండే (14) పరుగులు చేశారు.

బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఆ తర్వాత కివీస్ 8 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులే చేసింది. గ్రాండ్‌హోమీ (17 నాటౌట్), ఫిలిప్స్ (11) మినహా మిగతా వారు విఫలమయ్యారు. వర్షం ఆగిన 20 నిమిషాల్లోనే కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) గ్రౌండ్‌ను సిద్ధం చేయడం విశేషం. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications