
ఈ దశాబ్దపు టాప్-5 మొనగాళ్లు:
ఈ దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది వికెట్ కీపర్లు వచ్చారు. అయితే కొందరు మాత్రమే విజయవంతం అయ్యారు. మరోవైపు సీనియర్లు కూడా సత్తాచాటారు. విజయవంతమైన జాబితాలో భారత సీనియర్ కీపర్ ఎంఎస్ ధోనీ, శ్రీలంక కీపర్ కుమార సంగక్కర ముందు వరసలో ఉన్నారు. జొస్ బట్లర్, ముష్ఫికర్ రహీం, క్వింటన్ డికాక్‌లు కూడా రాణించారు. ఈ దశాబ్దంలో వన్డేల పరంగా ఏ వికెట్‌కీపర్ అగ్రస్థానంలో నిలిచాడో ఓసారి పరిశిలిస్తే.

మహీనే టాప్:
ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ కీపర్ ఎవరంటే ధోనీనే అని చెపుతారు. తనను మించిన కీపర్ లేడనేంతగా ప్రభావం చూపాడు. ధోనీ 2009-2019లో భారత్ తరపున 196 వన్డేలు ఆడాడు. 242 మంది బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఇందులో 170 క్యాచులు, 72 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఇక మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో 321 క్యాచులు, 123 స్టంపింగ్‌లు చేసాడు. ఈ దశాబ్దంలో మహీనే టాప్.

బట్లర్ భలే:
బ్యాటింగ్‌లోనే కాకుండా కీపర్‌గా మెరుపులు మెరిపించిన ఆటగాడు జొస్ బట్లర్. బట్లర్ విధ్వంసం ఏవిధంగా ఉంటుందో అందరికి తెలుసు. ఒంటిచేత్తో ఇంగ్లండ్ జట్టుకు అనేక విజయాలు అందించాడు. కీపర్‌గా కూడా తనదైన మార్క్ చూపెట్టాడు. ఈ దశాబ్దంలో 141 వన్డేలు ఆడి 202 మందిని ఔట్ చేసాడు. 171 క్యాచులు, 31 స్టంపింగ్‌లు ఉన్నాయి.

సంగా సూపర్:
అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం కుమార సంగక్కర. ధోనీ లాగే జట్టుకు నాయకత్వం కూడా వహించి ఔరా అనిపించుకున్నాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. 2015 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. సంగా 142 వన్డేలు ఆడి 188 మందిని ఔట్ చేసాడు. 155 క్యాచులు, 33 స్టంపింగ్‌లు ఉన్నాయి.

రహీం రచ్చ:
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం. తన అద్భుత కీపింగ్‌తో బంగ్లాకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ దశాబ్దంలో 145 వన్డేలు ఆడిన రహీం 175 మందిని ఔట్ చేసాడు. ఇందులో 142 క్యాచులు, 33 స్టంపింగ్‌లు ఉన్నాయి. క్వింటన్ డికాక్ దక్షిణాఫ్రికా జట్టుకు తూరుపుముక్క. అన్ని ఫార్మాట్‌లలో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. 114 వన్డేలు ఆడి 166 మందిని ఔట్ చేసాడు.


Click it and Unblock the Notifications












