సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసి, అఫ్గానిస్థాన్‌ను 3-0తో చిత్తుచేసిన రోహిత్ సేన మరో సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో అయిదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఉప్పల్ వేదికగా ఇవాళ నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా స్టోక్స్ మాట్లాడుతూ.. '' భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇది మాకు సవాలే. దానికి తగ్గట్టుగానే సన్నద్ధమయ్యాయం. టీమిండియా విజయవంతమైన జట్టు. ఇవాళ మ్యాచ్‌లో హార్ట్లీ అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు రెహాన్, లీచ్ స్పిన్నర్లుగా జట్టులో ఉన్నారు. పేసర్ మార్క్ వుడ్ ఎక్స్ ఫ్యాక్టర్'' అని అన్నాడు.

అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. '' టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లం. అయితే మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ అయినా ఆటలో పైచేయి సాధించే సత్తా ఉన్న ఆటగాళ్లు మాతో ఉన్నారు. ఇది మంచి సిరీస్. నేను తొలిసారిగా అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్నా. ఇక్కడ పరిస్థితుల్లో ఎలా రాణించాలో మాకు తెలుసు''
''ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం. బుమ్రా, సిరాజ్‌తో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ జట్టులో ఉన్నారు. కుల్‌దీప్‌ను పక్కపెట్టడం మాకు కష్టమైన విషయం .కానీ పరిస్థితుల దృష్ట్యా, బ్యాటింగ్‌లో కూడా రాణిస్తాడని అక్షర్‌ను తీసుకున్నాం'' ని రోహిత్ అన్నాడు. కాగా, పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంది.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ , రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్