Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే కోహ్లి మాటలు వినలేదు - స్మృతి మంధాన

ఎట్టకేలకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ఖాతాలో ట్రోఫీ చేరింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీ వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకుముందు వరకు ఢిల్లీపై ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఆర్సీబీ తుదిపోరులో అద్భుత ప్రదర్శన చేసింది. టేబుల్ టాపర్‌ను మట్టికరిపించింది. అంతేగాక టోర్నీ మొత్తం ఆర్సీబీ ప్లేయర్లదే హవా. అత్యధిక పరుగులు సాధించిన ఎలీస్ పెర్రీ (347 రన్స్)కి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన శ్రేయంక పాటిల్‌ (18 వికెట్లు)కు పర్పుల్ క్యాప్ దక్కింది.

That s why I didn t hear Virat Kohli s words - Smriti Mandhana

అయితే ట్రోఫీని గెలిచిన అనంతరం ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌కు విరాట్ కోహ్లి వీడియో కాల్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. వాళ్లతో కలిసి విరాట్ లాంగ్ డిస్టెన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. కాగా, గత సీజన్‌లో కోహ్లి తనతో, తన జట్టుతో చెప్పిన మాటలు ఎంతో మేలు చేశాయని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. అయితే వీడియో కాల్‌లో కోహ్లి చెప్పిన తాజా మాటలు తాను వినలేదని స్మృతి తెలిపింది.

''విరాట్ కోహ్లి చెప్పిన మాటలు నేను వినలేకపోయాను. ఎందుకంటే స్టేడియంలో చాలా పెద్ద‌పెద్ద సౌండ్స్. దీంతో కోహ్లి థంబ్స్‌ప్ సింబల్‌తో చెప్పాడు. నేను కూడా థంబ్స్‌ప్‌తో బదులిచ్చాను. త్వరలో అతన్ని కలుస్తాను. కోహ్లి కళ్లల్లో చాలా ఆనందం కనిపించింది. నాకు ఇంకా గుర్తు ఉంది.. అతడు గతేడాది వచ్చి మాతో మాట్లాడాడు. ఆ చిన్న సంభాషణ నాకు, మా జట్టుకు ఎంతో ఉపయోగపడింది''

''కోహ్లి ఫ్రాంచైజీలో భాగం. గత 16 ఏళ్లుగా ఆర్సీబీతో ఉన్నాడు. అందుకే అతని ముఖంలో ఎంతో ఆనందాన్ని చూశాను. కానీ ఇక్కడ శబ్ధాల వల్ల కోహ్లి చెప్పిన మాటలు వినలేదు. మేం బెంగళూరుకు వెళ్లినప్పుడు అతనితో కలిసి మాట్లాడతాను'' అని స్మృతి మంధాన పేర్కొంది. యువ స్పిన్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను స్మృతి కొనియాడింది.

శ్రేయాంక మంచి ప్లేయర్ అని, కానీ ఆదిలో కొన్ని మ్యాచ్‌ల్లో ఆమె సత్తాచాటలేకపోయిందని ఆర్సీబీ ఉమెన్స్ కెప్టెన్ పేర్కొంది. ఆ స్థితిలో నిరాశలో ఉన్న శ్రేయాంకతో కలిసి మాట్లాడానని, ఫైనల్‌లో కొన్ని అద్భుతాలు చేద్దామని చర్చించినట్లు తెలిపింది. పర్పుల్ క్యాప్‌ శ్రేయాంకకు మరింత సంతోషాన్ని అందించిందని స్మృతి వెల్లడించింది. శ్రేయాంక ఎంతో శ్రమిస్తుందని, క్రమంగా పరిపూర్ణ ప్లేయర్‌గా మారిందని ప్రశంసించింది.

Story first published: Monday, March 18, 2024, 14:51 [IST]
Other articles published on Mar 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+