Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్

హమ్మయ్యా.. ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన తర్వాత విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 35 పరుగుల తేడాతో నెగ్గింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో బెంగళూరు సత్తాచాటాంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5x4) ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4x4, 1x6) అర్ధశతకం అందుకున్నప్పటికీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు (3/30) వికెట్లు తీశాడు.

That s not what RCB team expects from Virat Kohli- Sunil Gavaskar

అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40*; 37 బంతుల్లో, 1x4, 1x6) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో, 3x4, 2x6), ప్యాట్ కమిన్స్ (31; 15 బంతుల్లో, 1x4, 3x6) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ (2/29), కామెరూన్ గ్రీన్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటారు.

అయితే విరాట్ కోహ్లి స్లో ఇన్నింగ్స్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. కోహ్లి నుంచి ఆర్సీబీ ఇలాంటి నిదానమైన ఇన్నింగ్స్‌ను ఆశించట్లేదని అన్నాడు. ఓపెనర్‌గా వచ్చి 15వ ఓవర్ వరకు క్రీజులో ఉండి 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేయడమేంటని ప్రశ్నించాడు. కోహ్లి మొదటి 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత ఎదుర్కొన్న 25 బంతుల్లో కేవలం 19 పరుగులే సాధించాడు.

''మిడిల్ ఓవర్లలో కోహ్లి టచ్ కోల్పోయినట్లుగా అనిపించింది. కచ్చితమైన స్కోరు తెలియదు కానీ, 31-32 పరుగుల నుంచి అతను ఔటైనంత వరకు ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. అంతిమంగా ఇన్నింగ్స్‌ను తొలి బంతిని ఎదుర్కొన్న అతను 15వ ఓవర్‌లో ఔటై 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. కోహ్లి నుంచి ఇలాంటి ఆటను జట్టు ఆశించట్లేదు'' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

Story first published: Friday, April 26, 2024, 7:57 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+