ధోని భవిష్యత్తుని నిర్ణయించేది ఐపీఎల్ ప్రదర్శనే: అది ఓ చేదుగుళిక అన్న రవిశాస్త్రి

IPL 2020 : MS Dhoni's Future Depends On How He Plays In IPL' Says Ravi Shastri || Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఓ చేదుగుళిక అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో డే నైట్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఆ ఓటమి ప్రతి ఒక్కరినీ బాధించిందని తెలిపారు.

జులై 11న జరిగిన తొలి సెమీపైనల్లో వరల్డ్‌కప్ రన్నరప్ న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అంతకముందు టోర్నీలో వరుసగా ఏడు లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సెమీస్‌కు అర్హత సాధించడంతో కోహ్లీసేన ఫైనల్స్‌కు చేరుతుందని అందరూ భావించారు.

ప్రపంచ క్రికెట్ నివ్వెరపోయిన సంఘటన: ఫిలిప్ హ్యూస్ మరణానికి ఐదేళ్లు

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా

అయితే ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విఫలమైంది. దీంతో భారత అభిమానులు సైతం నిరాశ చెందారు. కాగా, న్యూజిలాండ్ చేతిలో ఓడటానికి ముందు టీమిండియా ఏడు టెస్టులు, ఆరు టీ20లు, రెండు వన్డేలు గెలిచింది. సెమీస్‌లో కూడా విజయం కోసం చివరి వరకు టీమిండియా శ్రమించంది.

డే నైట్ టెస్టు అనంతరం

డే నైట్ టెస్టు అనంతరం

డే నైట్ టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి "నా వరకైతే సెమీస్‌లో టీమిండియా చూపిన తెగువ, పట్టుదల అద్భుతం. మాంచెస్టర్‌లో 15 నిమిషాల తర్వాత జట్టు అనూహ్యంగా తిరిగి పుంజుకుంది. ఆఖరి వరకు వచ్చిన సెమీస్‌లో ఓటమి ఓ చేదుగుళిక. దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అది అందరినీ కలిచివేసింది" అని అన్నారు.

ధోని రిటైర్మెంట్‌పై

ధోని రిటైర్మెంట్‌పై

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు తెరదించాలని రవిశాస్త్రి కోరారు. 2020 ఐపీఎల్లో ఎలా ఆడతాడనేదానిపైనే ధోని భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. వచ్చే సీజన్ ఐపీఎల్‌లో ధోని ప్రదర్శన చూసిన తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు దక్కుతుందో లేదో తెలుస్తుందని శాస్త్రి తెలిపారు.

ఐపీఎల్ తర్వాతే

ఐపీఎల్ తర్వాతే

"ధోని క్రికెట్‌ ఆడడం తిరిగి ఎప్పుడు ఆడతాడు, వచ్చే ఐపీఎల్‌లో ఎలా ఆడతాడన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరులు వికెట్‌ కీపింగ్‌లో ఎలా రాణిస్తున్నారు, ధోనీతో పోలిస్తే వాళ్ల ఫామ్‌ ఎలా ఉందన్నది కూడా ముఖ్యం. ఐపీఎల్‌ చాలా పెద్ద టోర్నీ. ఆ టోర్నీ తర్వాతే 15 మంది(టీ20 వరల్డ్‌కప్ కోసం)పై ఒక నిర్ణయానికి రావొచ్చు" అని రవిశాస్త్రి అన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, November 27, 2019, 10:15 [IST]
Other articles published on Nov 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X