న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో గాలిపటం.. కలవరపాటుకు గురైన వార్నర్!!

David Warner's Hilarious Take On 'Bizarre' Stoppage During 1st ODI Against India ! | Oneindia Telugu
Thats Some Poor Kids Kite: David Warners Hilarious Take On Bizarre Stoppage During 1st ODI

ముంబై: వాంఖడేలో మంగళవారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ గాలిపటం ఆటకు అంతరాయం కలిగించింది. 50వ ఓవర్లో జస్ప్రీత్‌ బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చే ముందు గాలిపటం స్పైడర్‌ కెమెరాకు చిక్కుకొని వేలాడింది. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ దానిని చూసి కాస్త కలవరపాటుకు గురయ్యాడు. గాలిపటాన్ని తొలగించేందుకు వెనుకంజ వేసాడు. ఇదే సమయంలో క్రీజులో ఉన్న బుమ్రా గాలిపటం​ దారాన్ని తెంచి కెమెరా నుంచి తీసేశాడు.

<strong>ఐసీసీ టెస్టు, వన్డే కెప్టెన్‌గా కోహ్లీ.. మరో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు!!</strong>ఐసీసీ టెస్టు, వన్డే కెప్టెన్‌గా కోహ్లీ.. మరో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

 గాలిపటం వల్ల నిలిచిన మ్యాచ్‌

గాలిపటం వల్ల నిలిచిన మ్యాచ్‌

గాలిపటం కారణంగా కాసేపు ఆట నిలిచింది. సాధారణంగా క్రికెట్‌ మ్యాచులు ఆగిపోవడానికి అతిపెద్ద కారకం వర్షం. కొన్నిసార్లు పక్షులు, పాములు, శునకాలు, మంచు, అభిమానులు మైదానంలోకి దూసుకురావడంతో ఆట కాసేపు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాంఖడేలో గాలిపటం వలన మ్యాచ్ కాసేపు ఆగిపోవడం గమనార్హం. అది ఏ పేద పిల్లాడి గాలిపటమో, దానిని చించొద్దని బుమ్రాతో వార్నర్ అన్నాడట.

చించొద్దని చెప్పా

చించొద్దని చెప్పా

మ్యాచ్‌ ముగిశాక ఈ సంఘటన గురించి వార్నర్ మాట్లాడుతూ... 'పతంగుల పండగ జరుగుతోందని విన్నాను. కొంచెం కొత్తగా అనిపించింది. గాలిపటం స్పైడర్‌ కెమెరాకు చిక్కుకుంది. అది కాస్త ప్రమాదకరంగా అనిపించింది. క్రీజులో ఉన్న బుమ్రా వెంటనే దారాన్ని తెంచి తొలగించాడు. బుమ్రా దానిని తొలగిస్తున్న సమయంలో.. అది ఏ పేద పిల్లాడి గాలిపటం కావొచ్చు, చించొద్దని చెప్పా. గాలిపటం వల్ల మ్యాచ్‌ ఆగడం మాత్రం విచిత్రంగానే అనిపించింది' అని వార్నర్‌ అన్నాడు.

వార్నర్‌ సెంచరీ

తొలి వన్డేలో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్‌ ధావన్‌ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్‌ రాహుల్‌ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' వార్నర్‌ (128 నాటౌట్‌), ఆరోన్ ఫించ్‌ (110 నాటౌట్‌) అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఈ విజయంతో సిరీస్‌లో ఆసీస్‌ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్‌ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

Story first published: Thursday, January 16, 2020, 11:03 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X