న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్లపై నుంచి వెళ్తున్న బంతి.. ఔటిచ్చిన అంపైర్‌!!

That’s a terrible decision: Umpire Nigel Llong slammed for absolute shocker

మెల్‌బోర్న్‌: క్రికెట్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే 'బాక్సింగ్‌ డే' టెస్టులో చోటుచేసుకున్నా.. బ్యాట్స్‌మన్‌ అప్రమత్తంగా ఉండడంతో అంపైర్‌ తప్పుడు నిర్ణయం నుండి బయటపడ్డాడు. విషయంలోకి వెళితే.

<strong>ఆటగాళ్లను ఆటపట్టించిన అంపైర్‌.. వీడియో చూస్తే నవ్వులే!!</strong>ఆటగాళ్లను ఆటపట్టించిన అంపైర్‌.. వీడియో చూస్తే నవ్వులే!!

బ్లండెల్‌ షాక్:

బ్లండెల్‌ షాక్:

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్టు ముగిసింది. నాలుగో రోజు ఆటలో కివీస్‌ ఓపెనర్‌ టామ్‌ బండెల్‌ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. ఆసీస్ పేసర్ జేమ్స్‌ పాటిన్‌సన్‌ వేసిన ఓ బంతి అతడి మోకాళ్లపైన తాకింది. ఆసీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో.. అంపైర్‌ నిగెల్‌ లాంగ్ ఔటిచ్చాడు. అంపైర్‌ నిర్ణయంతో బ్లండెల్‌ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

మెక్‌కల్లమ్‌ ఆగ్రహం:

మెక్‌కల్లమ్‌ ఆగ్రహం:

బ్లండెల్‌ రివ్యూ కోరగా.. అందులో బంతి వికెట్లపై నుంచి వెళ్లినట్టు తేలింది. మూడో అంపైర్‌ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో కివీస్‌ ఓపెనర్‌ బతికిపోయాడు. కామెంట్రీ చేస్తున్న న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసాడు. బంతి వికెట్లపై నుంచి వెళ్తున్నా ఔటివ్వడం సరికాదన్నాడు. ఈ మ్యాచ్‌లో నిగెల్‌ తప్పుడు అంపైరింగ్‌ చేయడం ఇదేం తొలిసారి కాదని మెక్‌కల్లమ్‌ అన్నాడు.

వార్న్‌ ఆశ్చర్యం:

వార్న్‌ ఆశ్చర్యం:

ఆసీస్ మాజీ ఆటగాడు షేన్‌ వార్న్‌ సైతం అంపైర్‌ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిగెల్‌ ఇదివరకు ప్రకటించిన ఔట్‌లను పరిగణలోకి తీసుకుంటే.. ఇది చాలా ఆశ్యర్యం కలిగించిందన్నాడు. ఈ తప్పుడు నిర్ణయంపై సోషల్ మీడియాలో అందరూ మండిపడుతున్నారు. ఈ అంపైరింగ్‌ చాలా దారుణం అంటూ పోస్టులు పెడుతున్నారు.

బ్లండెల్‌ సెంచరీ:

ఔట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడిన టామ్‌ బ్లండెల్‌ (121) సెంచరీ చేసాడు. అతడికి సహకరించే ఆటగాళ్లు లేకపోవడంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియా 247 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ 148 పరుగులకు కుప్పకూలగా.. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు డిక్లేర్ చేసింది. 487 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ 240 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Monday, December 30, 2019, 12:26 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X