|
ట్రెండింగ్‌లో థాంక్యూ పుజారా, థాంక్యూ రహానే హ్యాష్ ట్యాగ్
ఇక కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. పుజారా 9, రహానే ఒక్క పరుగు మాత్రమే చేశారు. దీంతో పుజారా, రహానేపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పుజారా, రహానే తమ కెరీర్లో చివరి మ్యాచ్‌లు ఆడేశారని అభిమానులు రాసుకొస్తున్నారు. అంతేకాకుండా #Thankyoupujara #ThankyouRahane అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
|
రహానే, పుజారా సెకండ్ ఇన్నింగ్స్‌కు విషెస్
పుజారా, రహానేకు ఇక రిటైర్మెంట్ సమయం వచ్చేసిందని ఇంత కాలం భారత జట్టుకు చేసిన సేవలు చాలని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇది పుజారా, రహానే తమ కెరీర్లకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అని వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా పుజారా, రహానే ఇన్ని రోజులు భారత జట్టుకు చేసి సేవలకుగాను ధన్యవాదాలు చెబుతున్నారు. అలాగే వైట్ డ్రెస్‌లో మళ్లీ పుజారా, రహానేను చూడలేం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత పుజారా, రహానే కెరీర్ బాగుండాలని కోరుకుంటూ జీవితంలో వారి సెకండ్ ఇన్నింగ్స్‌కు విషెస్ చెబుతున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ అంటూ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
|
రహానే, పుజారాను భుజాలపై మోసిన కోహ్లీ, పంత్
కాగా పలు ఫోటోలను మార్ఫింగ్ చేసి పుజారా, రహానే రిటైర్మెంట్ టైమ్‌గా అభివర్ణిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు చివరి మ్యాచ్ ముగిశాక మాష్టర్‌ను ఇతర ఆటగాళ్లంతా తమ భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పారు. ఇప్పడు ఆ ఫోటోలకు సచిన్ ప్లేసులో రహానే, పుజారా మోహాలను మార్ఫింగ్ చేసి అభిమానులు వైరల్ చేస్తున్నారు. అంతే కాదండోయ్ మార్ఫింగ్ చేసిన ఫోటోల ప్రకారం విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్.. పుజారా, రహానేను తమ భుజాలపై మోస్తూ గ్రౌండ్ మొత్తం తిప్పుతుంటే రోహిత్, గిల్, అశ్విన్ పక్కన నడుస్తున్నారు.
|
ఇక సాగనంపాల్సిందే
శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిని పక్కన పెట్టి పుజారా, రహానేను జట్టులోకి తీసుకోని మెనేజ్మెంట్ సాహోసేపత నిర్ణయం తీసుకుందని, అయినా ఫలితం లేకపోయిందని నెటిజన్లు వాపోతున్నారు. ఇకనైనా వారికి విశ్రాంతి ఇచ్చి అయ్యర్, విహారిని జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా చాలా కాలంగా పరుగులు చేయలేకపోతున్న పుజారా, రహానే సౌతాఫ్రికా పర్యటనలో చివరిదైనా కేప్‌టౌన్ టెస్టులోనూ విఫలమవడంతో ఇక వారి కెరీర్ ముగిసినట్టేనని అంతటా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే యువ ఆటగాళ్లకు అన్యాయం చేసి మరి పుజారా, రహానేకు చాలా అవకాశాలు ఇచ్చారని అంటున్నారు. అందుకే పుజరా, రహానేను రిటైర్మెంట్ పేరుతో ఇక సాగనంపాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పుజారా, రహానే మళ్లీ భారత జట్టుకు ఎంపికవడం కష్టమనే అంటున్నారు.