Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీలకు ధన్యవాదాలు: ఆరోన్‌ ఫించ్‌

Aaron Finch’s Heartfelt Message For MS Dhoni And Virat Kohli || Oneindia Telugu
Thank you Virat Kohli and MS Dhoni, Aaron Finch lauds duo for incredible gesture

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధన్యవాదాలు చెప్పాడు. ధోనీ, కోహ్లీల నంబర్ జెర్సీలను పట్టుకొని ఉన్న ఫొటోను ఫించ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. 'ఆస్ట్రేలియా, భారత్‌ సిరీస్‌లో కోహ్లీ, ధోనీలు వాళ్ల జెర్సీలు ఇచ్చారు. దీనిని ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. వేర్వేరు దేశాల కోసం మైదానంలో పోరాడుతాం. అయినా క్రికెట్‌లో మీరు ఇద్దరు అంటే నాకు ఎంతో గౌరవం' అని ఫించ్ పేర్కొన్నాడు.

భారత్‌ సిరీస్‌ అనంతరం ఫించ్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌ను 5-0తో వైట్ వాష్ చేసింది. ఈ సిరీస్‌లో ఫించ్ రెండు సెంచరీలు చేసాడు. ఆసీస్ ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌కు ముందు మంచి ప్రాక్టీస్‌లాగ ఉపయోగించుకుంది. మే 30న మొదలు కానున్న ప్రపంచకప్‌లో ఆసీస్ తమ మొదటి మ్యాచ్‌ను జూన్ 1న ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో ఆడనుంది. అంతకుముందు ఇంగ్లాండ్, శ్రీలంకలతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

Story first published: Monday, April 29, 2019, 13:45 [IST]
Other articles published on Apr 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+