థ్యాంకూ నెహ్రా: చివరి మ్యాచ్‌పై క్రికెటర్లు ఇలా (ట్వీట్లు)
హైదరాబాద్: టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్ కెరీర్‌కు తెరపడింది. బుధవారం తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌తోనే క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు నెహ్రా ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తన కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో నెహ్రా వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నెహ్రా 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చాడు. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కోహ్లీ జార విడిచాడు.

ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ వేసింది నెహ్రానే. చివరి ఓవర్లో అయినా నెహ్రాకు వికెట్ పడుతుందేమో అభిమానులు ఆశించారు. అయితే ఈ ఓవర్లో 7 పరుగులిచ్చిన నెహ్రా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ముఖ్యంగా చివరి రెండు మూడు బంతులు వేసేటపుడు నెహ్రా చాలా ఉద్వేగంగా కనిపించాడు.
మ్యాచ్ అనంతరం నెహ్రా జట్టులోని తన సహచర క్రికెటర్లతో స్టాండ్స్ వైపు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరిగాడు. కొంత దూరం వెళ్లాక కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ అతడిని భుజాల మీదికి ఎత్తుకుని విజయ గర్వంతో ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రౌండ్‌లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన కూడా ఈ మ్యాచ్‌లో మనకు కనిపించింది.
భారత క్రికెట్‌లో మహా దిగ్గజాలైన వీరేంద్ర సెహ్వాగ్‌కు, వీవీఎస్ లక్ష్మణ్‌కు, జహీర్ ఖాన్‌లకు కూడా సాధ్యం కాని ఫెర్‌వెల్ మ్యాచ్ నెహ్రాకు లభించింది. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన నెహ్రాపై పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. వీడ్కోలు అనంతరం నెహ్రా సెకండ్ ఇన్నింగ్స్ చక్కగా సాగాలని పలువురు ఆకాంక్షించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications