Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విధ్వంసానికి టీ20 క్రికెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. SRH బ్యాటర్ల ఊచకోతను చూసి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ప్రత్యర్థి బౌలర్లపై జాలి చూపిస్తున్నారు. ఈ సీజన్‌లో తెలుగు టీమ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ 11 ఏళ్ల 262 స్కోరు రికార్డును రోజుల వ్యవధిలోనే సన్‌రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది.

ఈ రికార్డును చూస్తేనే SRH విధ్వంసం తెలిసిపోతుంది. టాప్ స్కోరర్ జట్టుగా పేరు ఉన్న ఆర్సీబీపైనే 287 పరుగుల రికార్డు స్కోరు చేసింది. బలమైన ముంబై ఇండియన్స్‌ను (277 రన్స్) ఎస్‌ఆర్‌హెచ్ వదిలిపెట్టలేదు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై (266 పరుగులు) విరుచుకుపడింది. ఇవాళ సొంతమైదానంలో ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో తెలుగు టీమ్ తలపడనుంది. ఈ రోజు ఎలాంటి ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుందనే ఉత్కంఠ అందరిలో మొదలైంది.

Thank God I am not bowling against SRH- Wasim Akram

అయితే పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. SRH బ్యాటింగ్ చట్టవిరుద్ధమని, సన్‌రైజర్స్ జట్టుకు తాను బౌలింగ్ చేయనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుత ప్రపంచ లీగుల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ను మించిన భీకర బ్యాటింగ్ లైనప్ ఏ జట్టుకూ లేదని వసీమ్ అక్రమ్ తెలిపాడు.

''అయిదు ఓవర్లలో SRH 100 పరుగులు చేస్తోంది. ఇది చట్ట విరుద్ధం. ప్రత్యర్థి ఫుల్ టాస్ బంతుల్ని వేస్తున్నా ఇది అసాధ్యమే. ఈ ఫార్మాట్‌లో బౌలర్లను చూస్తే బాధేస్తోంది. కానీ విధ్వంసం జరుగుతోంది. బౌలర్లు కాస్త భిన్నంగా ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ 5 ఓవరల్లో 100 పరుగులు చేయడమనేది అవాస్తవంగా అనిపిస్తోంది''

''ఆస్ట్రేలియన్ల ఆటను మనం ఇష్టపడుతుంటాం. ఫాస్ట్ బౌలర్ కమిన్స్ జట్టును నడిపించడంతో ఇలా జరుతుందని చెప్పలేం. షాహిన్ అఫ్రిది కూడా జట్టుకు సారథిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ట్రావిస్ హెడ్‌తో పాటు ప్రమాదకర బ్యాటర్లు ఉన్నారు. ప్రపంచ లీగ్ క్రికెట్‌లో సన్‌రైజర్స్‌ను మించి భయపెట్టే టీమ్ లేదు. ఇక టీ20 క్రికెట్‌లో హెన్రిచ్ క్లాసెన్ నా ఫేవరేట్ ప్లేయర్. అతడు ఏ బంతినైనా సిక్సర్‌గా మలచగలడు. అబ్దుల్ సమద్ గ్రేట్ ఫినిషర్''

''అందుకే SRH టాప్‌లో ఉంటుంది. కమిన్స్ జట్టును శాంతంగా నడిపిస్తున్నాడు. అయితే 270 స్కోరు చేయడమనేది మామూలు విషయం కాదు. వన్డేల్లో 500 స్కోరు చేసినట్లే. థ్యాంక్ గాడ్.. నేను వాళ్లకు బౌలింగ్ చేయట్లేదు. క్రికెట్ ఎలా మారిందో అని చెప్పడానికి ఇదో సాక్ష్యం'' అని వసీమ్ అక్రమ్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, April 25, 2024, 12:47 [IST]
Other articles published on Apr 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+