
దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ పోస్ట్ మార్టమ్ ముగిసింది. పోస్ట్ మార్టమ్ రిపోర్టును బట్టి షేన్ వార్న్‌ది సహజ మరణమేనని థాయ్‌లాండ్ పోలీసులు ధృవీకరించారు. పోస్ట్ మార్టమ్‌లో షేన్ వార్న్‌ది సహజ మరణేమనని తేలిందని వైద్యులు నిర్ధారించారని వారు తెలిపారు. అలాగే షేన్ వార్న్ మృత దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు ఇచ్చిన నివేదికను వార్న్ కుటుంబసభ్యులతోపాటు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి కూడా పంపినట్లు థాయ్ లాండ్ పోలీసుల ప్రతినిధి కిస్సానా ఫఠానాచారోయెన్ చెప్పారు.
షేన్ వార్న్ హఠాన్మరణంపై ఆయన కుటుంబసభ్యులు కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని తెలిపారు. కాగా ప్రాథమికంగా ఆయన గుండె పోటుతోనే చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే షేన్ వార్న్ మృత దేహాన్ని ఆస్ట్రేలియాకు ఎప్పుడూ పంపుతారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
మార్చిన 4న హఠాన్మరణం చెందిన స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌తో తనకున్న అనుబంధాన్ని తలచుకుని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ రోజు ఉదయం నిద్ర లేచాక తన పిల్లలను నెట్ సెషన్‌కు తీసుకెళ్లడానికి తాను సిద్ధమవుతండగా షేన్ వార్న్ మరణ వార్త గురించి తన భార్య రియానా తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు.
మొబైల్‌లో వచ్చిన వార్తలను చూసి రియానా తనతో షేన్ వార్న్ మరణ వార్తను తెలిపిందని, అది విని తాను వెంటనే తన భార్య చేతిలో నుంచి మొబైల్ లాక్కుని చూశానని ఆయన తెలిపాడు. షేన్ వార్న్ మరణ వార్తను తాను నమ్మలేకపోయానని పాంటింగ్ చెప్పాడు.
52 ఏళ్ల షేన్ వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో గుండెపోటుతో మరణించాడు. దీంతో క్రీడా లోకం ఒక్క సారిగా దిగ్భ్రాంతికి లోనయింది. 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే మొత్తంగా రెండో బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో షేన్ వార్న్‌లో టెస్టుల్లో 708, వన్డేల్లో 291 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వెయ్యికిపైగా వికెట్లు తీశాడు. ఈ క్రమంలో షేన్ వార్న్ తన స్పిన్ మాయ జాలంతో బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు.