సిరాజ్, తిలక్ వర్మలపై కాసుల వర్షం.. తెలంగాణ కుర్రాళ్లకు బంపర్ ఛాన్స్!
తెలంగాణ క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రిన్సెస్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొట్టమొదటి 'TG20' లీగ్ ప్లేయర్స్ వేలం పాట ఘనంగా ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందిన దాదాపు 1,300 మందికి పైగా స్థానిక క్రికెటర్ల పూల్ నుంచి మొత్తం 8 సరికొత్త ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను పోటీపడి మరీ దక్కించుకున్నాయి. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, వేలం నిర్వాహకుడు చారు శర్మ నేతృత్వంలో ఈ డ్రాఫ్ట్ ప్రక్రియ అత్యంత ఆసక్తికరంగా సాగింది.
ఈ చారిత్రాత్మక వేలంలో భారత స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ అత్యధిక ధరకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాడు. మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.33 లక్షల భారీ ధరను వెచ్చించి తిలక్ వర్మను తమ సొంతం చేసుకుంది. అలాగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను వరంగల్ వారియర్స్ జట్టు రూ.14 లక్షలకు కొనుగోలు చేసింది. అన్‌క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని) ప్లేయర్ల కేటగిరీలో సి.వి. మిలింద్ అందరికంటే అత్యధిక ధరకు అమ్ముడై ఆశ్చర్యపరిచాడు. అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు ఇతని కోసం రూ.17 లక్షలు వెచ్చించింది.

ఐకాన్ కేటగిరీలో ఇతర ప్రముఖ ఆటగాళ్లను కూడా ఫ్రాంచైజీలు భారీ ధరలకు దక్కించుకున్నాయి. వీరిలో రవి కిరణ్ (పాలమూరు స్ట్రైకర్స్), టి. రవితేజ (మెదక్ ఫాల్కన్స్), తనయ్ త్యాగరాజన్ (ప్రణవ రంగారెడ్డి రైజర్స్), రాహుల్ బుద్ధి (అనురాగ్ నల్గొండ నైట్స్), తన్మయ్ అగర్వాల్ (కరీంనగర్ డైమండ్స్), రోహిత్ రాయుడు (పాలమూరు స్ట్రైకర్స్) వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే 'ఎ+' కేటగిరీలో అమన్ రావు (వరంగల్ వారియర్స్), ప్రజ్ఞయ్ రెడ్డి (పాలమూరు స్ట్రైకర్స్), అజయ్ దేవ్ గౌడ్ (హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్)తో పాటు నితిన్ సాయి యాదవ్, ఆరోన్ జార్జ్, రక్షణ్ రెడ్డిలను మార్క్యూ ప్లేయర్లుగా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.
మరోవైపు 'ఎ' కేటగిరీలో యువ ప్రతిభావంతులకు కూడా మంచి డిమాండ్ పలికింది. అర్ఫాజ్ అహ్మద్, అభిరత్ రెడ్డిలు చెరో రూ.11 లక్షల చొప్పున ఈ కేటగిరీలో జాయింట్-హైయెస్ట్ బిడ్‌గా నిలిచారు. వీరితో పాటు చందన్ సహాని (కరీంనగర్ డైమండ్స్), ప్రణవ్ వర్మ (హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్), హిమ తేజ (అన్విత ఖమ్మం ఏసెస్)లు కూడా మంచి ధరలకు అమ్ముడయ్యారు. తెలంగాణలోని ప్రతిభావంతులైన క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ టీజీ20 లీగ్ తొలి ఎడిషన్, 2026 జూన్ 21 నుండి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొత్తం 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 8 ఫ్రాంచైజీలు 32 మ్యాచ్‌లలో తలపడనున్నాయి.
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ఇదే..
ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్(రామోజీ గ్రూప్) జట్టు 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఇప్పటివరకు రూ.58.95 లక్షలు వెచ్చించి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
పూర్తి జట్టు సభ్యుల జట్టు: అజయ్ దేవ్ గౌడ్(రూ.11లక్షలు), అభిరత్ రెడ్డి (రూ.11లక్షలు), ప్రణవ్ వర్మ(రూ.8.5 లక్షలు), సాయి వికాస్ రెడ్డి(రూ.4.25 లక్షలు), అన్విత్ రెడ్డి(రూ.3.5 లక్షలు), గణేష్ గడుగు(రూ.3.25 లక్షలు) , యశ్వీర్ గౌడ్(రూ.3 లక్షలు), శ్రీనికేత్(రూ.2.3 లక్షలు), అఖిల్ రాథోడ్(రూ.1.6 లక్షలు), తరుణ్ రాజన్(రూ.1.6 లక్షలు), షణ్ముఖ రాజన్(రూ.1.5 లక్షలు), పి.అరవింద్(రూ.లక్ష) ప్రేమ్ చరణ్ (రూ.95 వేలు), గుడెల్లి జశ్వంత్ (రూ.75 వేలు), వైష్ణవ్ రెడ్డి (రూ.75 వేలు), నితిన్ నాయక్ (రూ.75 వేలు), ఎంఎం చరణ్ (రూ.75 వేలు), దేవ్ మెహతా (రూ.75 వేలు), మిర్యాల ప్రత్యూష్‌కుమార్ (రూ.75వేలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications