Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలంగాణ క్రికెట్ ధమాకా: రామోజీ ఫిలిం సిటీలో TG20 వేలం షురూ!

తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడుతోంది. రాష్ట్రంలోని తొలిసారిగా ప్రతిష్టాత్మక ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్ 'TG20' నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి అత్యంత కీలకమైన ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ లీగ్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు తలపడనుండగా.. ఉప్పల్ స్టేడియం వేదికగా 21 రోజుల పాటు మొత్తం 32 మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి.

ఈ వేలం పాటలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా భారత స్టార్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు సీనియర్ క్రికెటర్లు రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్‌లతో పాటు అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్, మరెంతో మంది హైదరాబాద్ యువ క్రికెటర్లు వేలం బరిలో నిలిచారు. ప్రముఖ ఆక్షనీర్ చారు శర్మ ఈ వేలాన్ని నిర్వహిస్తుండగా.. క్రికెట్ ప్రేమికుల కోసం jiohotstar.com లో ఈ ప్రక్రియ లైవ్ ప్రసారం అవుతోంది.

TG20 League Auction Begins at Ramoji Film City 8 Teams to Battle at Uppal Stadium Details

ప్లేయర్ల ఎంపిక కోసం ప్రతి ఫ్రాంచైజీకి రూ.60 లక్షల పర్స్ మనీని కేటాయించారు. ఇందులో ప్రతి టీమ్ కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. గరిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఈ వేలం ప్రక్రియను ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీల వారీగా విభజించి పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. లీగ్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు, ఇప్పటికే మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు నేతృత్వంలోని టీమ్ ఓపెన్ ట్రయల్స్ నిర్వహించి అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించింది.

ఈ TG20 లీగ్ ప్రధాన లక్ష్యం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలను కూడా పొందుపరిచారు. ప్రతి టీమ్‌లో కనీసం నలుగురు (4) జిల్లా ఆటగాళ్లు ఉండటం తప్పనిసరి చేయగా.. మ్యాచ్ జరిగే సమయంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో కనీసం ఇద్దరు జిల్లా ప్లేయర్స్ ఖచ్చితంగా ఆడాలనే నిబంధన పెట్టారు. ఈ రూల్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల యువ క్రికెటర్లకు ఇదొక సువర్ణావకాశంగా మారనుంది.

Story first published: Sunday, June 7, 2026, 8:49 [IST]
Other articles published on Jun 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+