Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్ట్ నెగ్గినా... ఫిట్‌నెస్‌కు విరామం ఉండదు: ట్విట్టర్‌లో కోహ్లీ

Test won, but no days off for skipper Virat Kohli

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ పరంగా జట్టులోని సహచర క్రికెటర్లకు బెంచ్‌మార్క్‌గా నిలిచాడు. ఈ మధ్య కాలంలో భారత జట్టులోని క్రికెటర్లు ఫిట్‌నెస్ పరంగా ధృడంగా ఉండటానికి కారణం కోహ్లీనే అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మ్యాచ్‌తో సంబంధం లేకుండా మ్యాచ్‌లేని రోజుల్లో కూడా కోహ్లీ జిమ్‌కు వెళుతుంటాడు.

అతడి దైనందిన జీవితంలో ఫిట్‌నెస్ ఓ భాగం. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ ప్రతిరోజూ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తుంటాడు. తాజాగా, సోమవారం కూడా జిమ్‌లో కోహ్లీ కసరత్తులు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ఫిట్‌నెస్‌కు విరామం అనేది ఉండదు" అని కామెంట్ పెట్టాడు.

తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం

బంగ్లాదేశ్‌తో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.

అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా

అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా

ఫలితంగా అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 10 ఇన్నింగ్స్ విజయాలు ఉండగా, భారత కెప్టెన్‌గా ధోని 9 ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేశాడు.

అలెన్ బోర్డర్ రికార్డు సమం

అలెన్ బోర్డర్ రికార్డు సమం

ఈ జాబితాలో మహ్మద్ అజారుద్దీన్ 8 ఇన్నింగ్స్ విజయాలతో మూడో స్థానంలో నిలవగా... సౌరవ్ గంగూలీ 7 ఇన్నింగ్స్ విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 32 టెస్ట్ విజయాలు రికార్డుని విరాట్ కోహ్లీ సమం చేశాడు.

నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్‌లో డే/నైట్ టెస్టు మ్యాచ్‌

నవంబర్ 22న ఈడెన్ గార్డెన్స్‌లో డే/నైట్ టెస్టు మ్యాచ్‌

సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ఉమ్మడిగా విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ వా 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ని బీసీసీఐ డే/నైట్ టెస్టు మ్యాచ్‌గా నిర్వహించడం విశేషం.

Story first published: Monday, November 18, 2019, 18:43 [IST]
Other articles published on Nov 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+