'మ్యాచ్ తీవ్రత ఆడితేనే తెలుస్తోంది'

హైదరాబాద్: బరిలోకి దిగితేనేగానీ భారత్‌తో పోటీపడటమెంత తీవ్ర స్థాయిలో ఉంటుందో తెలుస్తుందోనని అఫ్ఘాన్ జట్టు కోచ్ సైమన్స్ వివరించాడు. జూన్ 14 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగనుంది. అంతకంటే ముందు ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రెండు వారాల నుంచి ఈ రెండు మ్యాచ్‌ల కోసం సిమన్స్ రెండు జట్లను తీర్చిదిద్దుతున్నాడు.

రెండింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ
ఒకే సమయంలో టీ20, టెస్టు జట్లకు శిక్షణ ఇవ్వడం కత్తిమీద సాము. మ్యాచ్ వరకు వచ్చేసరికి ఇది కొద్దిగా సులువుకావొచ్చేమో. టూర్లను ఎలా రూపొందిస్తారో అర్థంకావడం లేదు. సాధారణంగా టెస్టు ముందు ఉండి, పరిమిత ఓవర్ల క్రికెట్ తర్వాత ఉంటే బాగుంటుంది. రెండింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టొచ్చు అని సిమన్స్ పేర్కొన్నాడు.

19 ఏళ్ల వయస్సు ఉన్న రషీద్ ఖాన్‌లో 30ఏళ్ల అనుభవం
'19 ఏళ్ల వయస్సు ఉన్న రషీద్ ఖాన్‌లో 30ఏళ్ల ఆటగాడి అనుభవం దాగి ఉంది. అతని నుంచి జట్టు ఏమి ఆశిస్తోందో రషీద్‌కు తెలుసు. అఫ్గాన్ జట్టులో రషీద్ కన్నా చిన్నవాడు ముజీబ్(17 సంవత్సరాలు). భారత్‌తో టెస్టులో వీరిద్దరి ప్రదర్శనపైనే భారీ అంచనాలు ఉన్నాయి.

ఆటగాళ్లు ఓర్పుగా ఆడాలి.
ఈ ఫార్మాట్‌లో ఆటగాళ్లు ఓర్పుగా ఆడాలి. గత ఏడాది రషీద్ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై మంచి ప్రదర్శన చేశాడు. అతనికి వికెట్లు కూడా దక్కాయి. ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు. అక్కడ వికెట్లు దక్కించుకున్నాడు. ఆదివారం నుంచి అఫ్గాన్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత భారత్‌తో ఏకైక టెస్టు ఆడాలి. వెంటవెంటనే మ్యాచ్‌లు ఉండటంతో అఫ్గాన్ ఆటగాళ్లు భారత్‌తో టెస్టు కోసం సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లేదు.'

ప్రత్యేకంగా సూచనలు ఇవ్వడంలేదు:
'మొదటి టెస్టు ఆడుతోన్నఅఫ్గాన్ ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వడంలేదు. ఆడుతుంటే వారే అర్ధం చేసుకుంటారు. వారిపై నాకు ఆ నమ్మకం ఉంది. ఐపీఎల్ ఆడారు కాబట్టి భారత్ పిచ్‌లపై కొందరు ఆటగాళ్లకు అవగాహన ఉంది. దాన్ని అవకాశంగా మలచుకుంటాం. పవిత్ర రంజాన్ మాసంలో ఆడటం మా ఆటగాళ్లకేమీ కొత్త కాదు. గతంలోనూ ఆడారు'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications