
హైదరాబాద్: విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు వెస్టిండీస్ ఆటగాడైన క్రిస్ గేల్. ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయని సమయంలో పంజాబ్ జట్టు ప్రారంభ ధరకే తనని సొంతం చేసుకుంది. ఆ కసితోనో, లేదా మళ్లీ తన ఫామ్‌ను నిలబెట్టుకోవడానికో ఐపీఎల్ 11లో ఆడిన మ్యాచ్‌లు అన్నింటిలోనూ తెగ బాదేస్తున్నాడు క్రిస్ గేల్.
విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఐపీఎల్ ద్వారా ఇండియాతో ఆత్మీతయ ఏర్పడి పోయింది. ఇక్కడి పరిస్థితులన్నా.. అలవాట్లన్నా తనకు చాలా ఇష్టమని గతంలో గేల్ చాలా సార్లు చెప్పుకున్నాడు. ఇక గేల్ మైదానంలోనే కాదు.. బయట కూడా ఫుల్ జోష్‌ను ప్రదర్శిస్తుంటాడు. ఇండియన్ పాటలను వినటం.. వాటికి చిందులేయటం ఇతగాడికి అలవాటే. తాజాగా గేల్ డాన్స్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
'తేరీ ఆక్యా కా యో కాజల్' అంటూ సింగర్ వీర్ దహియా పాడిన హర్యానా పాట(హరియాణ్వి జానపద గేయం).. ఉత్తరాదిలో బాగా పాపులర్ అయ్యింది. పాటలో నటించిన స్వప్న చౌదరి పేరు మారుమోగిపోయింది. ఏ వేడుకలో అయినా దాదాపుగా ఈ పాట సందడి తప్పనిసరి అయిపోయింది. చాలా మంది సెలబ్రిటీలు తమ వర్షన్‌లుగా ఆయా పాటలకు చిందులు కూడా వేశారు.
అలాంటి సాంగ్‌కు గేల్ లయబద్ధంగా స్టెప్పులేస్తూ ఊగిపోయాడు. నెటిజన్లు దీన్ని తెగ లైక్ చేస్తుండటంతో ఈ మధ్య వైరల్‌గా మారిపోయింది. దాంతో పాటుగా మిగిలిన బిగ్ బాస్ కంటెస్ట్‌లందరూ కలిసి చిందులేసిన వీడియో సాంగ్ కూడా దీంతో పాటుగా అందరినీ ఆకట్టుకుంటోంది.