For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మాయిల ఫైట్- హర్మన్‌ప్రీత్ అక్కా.. ఎందుకంత కోపం? (వీడియో)

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరు 233/5తో ఆదివారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులకే ఆలౌటైంది. స్నేహ రాణా నాలుగు వికెట్లతో సత్తాచాటింది. హర్మన్ ప్రీత్, గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆసీస్ బ్యాటర్లలో తాహితా మెక్‌గ్రాత్ (73) టాప్ స్కోరర్.

అయితే ఇరు జట్ల కెప్టెన్ల మధ్య మినీ ఫైట్ జరిగింది. హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో అలిస్సా హీలి (32) క్రీజును వదిలి ముందుకు వచ్చి డిఫెండ్ చేసింది. అయితే బాల్‌ను అందుకున్న హర్మన్ ప్రీత్ రనౌట్ చేయాలని త్రో విసిరింది. అయితే బాల్‌ను అలిస్సా హీలి తన బ్యాటుతో అడ్డుకుంది. దాంతో 'అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్'గా హర్మన్‌ప్రీత్ అపీల్ చేసింది. కానీ అంపైర్లు అపీల్‌ను తిరస్కరించారు.

tense scene between Harmanpreet Kaur and Alyssa Healy. Harmanpreet was furious

అయితే తర్వాతి బంతికే హీలిని హర్మన్ ప్రీత్ ఔట్ చేయడం విశేషం. స్వీప్ షాట్‌కు యత్నించిన ఆసీస్ కెప్టెన్‌ను భారత్ కెప్టెన్ తెలివిగా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కవ్వించే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు హర్మన్‌ప్రీత్ సరైన విధంగా సమాధానం చెబుతుందని కొందరు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అంత కోపం ఎందుకని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత మహిళ జట్టు పది సార్లు తలపడగా ఒక్కసారి కూడా గెలుపు అందుకోలేకపోయింది. కానీ ఈసారి ఆసీస్‌ను ఓడించి చరిత్ర సృష్టించనుంది. భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇటీవల ఇంగ్లాండ్‌పై టీమిండియా 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహిళల టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం.

Story first published: Sunday, December 24, 2023, 12:09 [IST]
Other articles published on Dec 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+