త్వరలో 100వ బర్త్‌డే: జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాడి ఇంటికి సచిన్, వా

హైదరాబాద్: ప్రస్తుతం జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాళ్లలో పెద్ద వయస్కుడైన వసంత్ రైజీని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సోమవారం కలిశారు. 99 ఏళ్ల వసంత్ రంజీని కలిసేందుకు సచిన్ టెండూల్కర్, స్టీవ్ వా ముంబైలోని ఆయన ఇంటికి వెళ్లారు.
జనవరి 26న ఆయన 100వ పుట్టినరోజుని జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్, మార్క్ వా ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. 99 ఏళ్ల వసంత్ రంజీ 1940ల్లో తొమ్మిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 277 పరుగులు చేశాడు. ఆయన అత్యధిక స్కోరు 68.
అప్పటి బాంబే జింఖానా మైదానంలో టీమిండియా స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ (1933) ఆడినపుడు అతని వయసు 13 ఏళ్లు కావడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరిస్ కోసం భారత పర్యటనకు వచ్చింది.
ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే మంగళవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత బలమైన ప్రత్యర్థితో తలపడని టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సన్నద్ధమైంది. సెమీస్‌లోనే ఓడిన ఆసీస్.. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ వన్డే బరిలోకి దిగుతోంది.
పూర్తి స్థాయి జట్టుతో కంగారూలు పటిష్టంగా కనిపిస్తుండగా.. స్వదేశంలో కోహ్లీసేన ఏ రకంగా చూసినా బలమైనదే. మూడు వన్డేల సిరీస్‌లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ఆ-స్ట్రేలియా తలపడనున్నాయి. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications